Ads
టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయనకు అభిమానులు నీరాజనం పడుతుంటారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన ఎనర్జిటిక్ డాన్స్ పెర్ఫార్మన్స్ లతో యావత్ దేశంలో అంతులేని అభిమానుల్ని సంపాదించుకున్నారు.
Video Advertisement
అల్లు అర్జున్ కి తెలుగు నాట మాత్రమే కాకుండా కేరళలో కూడా ఎక్కువ అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఇక పుష్ప సినిమాతో బాలీవుడ్ లోను అల్లు అర్జున్ కి అభిమానులు ఎక్కువ అయ్యారు.
ఏ సినిమాలో అయినా సరే అల్లు అర్జున్ తన డాన్స్ ని ఇరగదీసాడు. ప్రతి సినిమాలోనూ అల్లు అర్జున్ వేసే స్టెప్పులు వైరల్ అవుతూ ఉంటాయి. అలాంటి అల్లు అర్జున్ తన కెరీర్ స్టార్టింగ్ లో ఓ పాటకి కొరియోగ్రఫీ చేసారు అని తెలుసా..? అది కూడా పవన్ కళ్యాణ్ సినిమాకి. నిజమే. అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఓ పాటకి కొరియోగ్రఫీ చేసారు. అది ఏ సినిమాలో పాటో ఇప్పుడు తెలుసుకుందాం.
పవన్ కళ్యాణ్, మీరా జాస్మిన్ జంటగా నటించిన గుడుంబా శంకర్ సినిమా గుర్తుంది కదా.. ఈ సినిమాలో విలన్ పెళ్లి సందర్భంగా చిలకమ్మా అనే పాట ఒకటి వస్తుంది. ఈ పాటకు స్టెప్పులని అల్లు అర్జున్ కంపోజ్ చేసారు. అల్లు అర్జున్ ఈ పాటకి కొరియోగ్రాఫర్ గా పని చేసారు. కెరీర్ ప్రారంభంలోనే డాన్స్ పట్ల తనకు ఉన్న ఇష్టాన్ని, ప్రతిభని అల్లు అర్జున్ కనబరిచారు. ఇప్పుడు ఈ టాపిక్ విషయమై సోషల్ మీడియాలో కూడా మీమ్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి. అంత చిన్న వయసులో అలాంటి బాధ్యత తీసుకుని.. డాన్స్ పై తనకి ఉన్న ఇష్టాన్ని చూపడంతో.. అభిమానులు సైతం అల్లు అర్జున్ ని ప్రశంసల్లో ముంచెత్తేస్తున్నారు.
End of Article