Ads
కరోనా కారణం గా ప్రజలు థియేటర్లకు రావడం తగ్గించేశారు. నిన్న మొన్నటి వరకు థియేటర్స్ ఓపెన్ లో లేకపోవడం.. సినిమాలు కూడా ఓటిటి లలోనే విడుదల అవుతుండడం తో.. ఓటిటి కి, బుల్లితెరపై బాగా క్రేజ్ పెరిగింది. ఈ క్రమం లోనే బుల్లితెరపై ప్రసారమయ్యే షో ల విషయం లో కూడా ఛానెల్ యాజమాన్యాలు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాయి.
Video Advertisement
ప్రస్తుతం బుల్లితెర హంగామా ఓ రేంజ్ లో ఉంది. వెండితెర స్టార్లు కూడా బుల్లితెర పై తళుక్కుమనడానికి సంకోచించడం లేదు. బిగ్ బాస్, మీలో ఎవరు కోటీశ్వరుడు వంటి షో లతో నాగార్జున, చిరంజీవి, నాని, ఎన్టీఆర్ వంటి హీరోలు ఇప్పటికే బుల్లితెరపై సందడి చేసారు. తాజాగా బుల్లితెరపై మరొక షో రాబోతోంది. బాలీవుడ్ లో బాగా పేరు తెచ్చుకున్న మాస్టర్ చెఫ్ కార్యక్రమం తమిళ, తెలుగు భాషల్లో కూడా ప్రారంభం కాబోతోంది.
తెలుగు లో ప్రారంభం కాబోయే షో కి “తమన్నా” హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. ఇటీవలే, ఈ షో కి సంబంధించి తొలి ఎపిసోడ్ ప్రోమో కూడా రిలీజ్ అయింది. ఈ ప్రోమో అందరిని ఆకట్టుకుంటోంది. అయితే ఫస్ట్ ఎపిసోడ్ కు ఎవరు గెస్ట్ గా రాబోతున్నారు అన్న విషయాన్నీ మాత్రం సస్పెన్స్ లో ఉంచారు. అయితే, తాజా గా అల్లు శిరీష్ షేర్ చేసిన ఇన్స్టా స్టోరీ తో ఆ సస్పెన్స్ కూడా వీడింది. మాస్టర్ చెఫ్ ఫస్ట్ ఎపిసోడ్ కు ఆయనే గెస్ట్ గా రానున్నారు.
తమన్నా తో కలిసి మాస్టర్ చెఫ్ లో భాగం కాబోతున్నందుకు ఆనందం గా ఉందని పేర్కొన్నారు. ఈ షో లో ఫస్ట్ సెలబ్రిటీ గెస్ట్ అయినందుకు ఎగ్జైటింగ్ గా ఉందని పేర్కొన్నారు. తొందరలోనే ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఇక అల్లు శిరీష్ బుల్లితెరపై ఎలా సందడి చేస్తారో వేచి చూడాలి.
Watch Video:
End of Article