అమల ఒక వెబ్ సిరీస్‌లో నటించారు అని తెలుసా..? ఎందులో స్ట్రీమ్ అవుతోంది అంటే..?

అమల ఒక వెబ్ సిరీస్‌లో నటించారు అని తెలుసా..? ఎందులో స్ట్రీమ్ అవుతోంది అంటే..?

by Harika

Ads

గత కొంత కాలం నుండి అమల అక్కినేని అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తూ ఉన్నారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ఆ తర్వాత అమల ఒక వెబ్ సిరీస్ చేశారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఆ వెబ్ సిరీస్ తెలుగులో వెబ్ సిరీస్ అనే విషయం అందరికీ తెలియక ముందు వచ్చింది. ఈ సిరీస్ పేరు హై ప్రీస్టెస్. జి ఫైవ్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ 8 ఎపిసోడ్లుగా విడుదల అయ్యింది. ఈ సిరీస్ కి పుష్పా ఇగ్నేషియస్ దర్శకత్వం వహించారు. ఇందులో అమలతో పాటు, భవాని శ్రీ నందిని రాయ్, బ్రహ్మాజీ, సునైనా, వరలక్ష్మి శరత్ కుమార్, విజయలక్ష్మి, కిషోర్ కుమార్ కూడా నటించారు. ఈ సిరీస్ లో స్వాతి రెడ్డి అనే ఒక టారోట్ రీడర్ గా అమల నటించారు.

Video Advertisement

amala akkineni web series

మిగిలిన పాత్రలు అందరూ కూడా ఎపిసోడ్ కి మారుతూ ఉంటారు. కొత్త పాత్రలు ఎపిసోడ్ ముందుకు వెళుతున్న కొద్ది వస్తూ ఉంటారు. స్వాతి రెడ్డి అనే ఒక వ్యక్తి జీవితంలో జరిగే సంఘటనల చుట్టూ, ఆమెతో మాట్లాడిన లేదా ఆమె స్నేహితులుగా ఉన్న వ్యక్తుల జీవితంలో జరిగే సంఘటనలు చుట్టూ ఈ సిరీస్ నడుస్తుంది. ఒక్కొక్క విషయాన్ని స్వాతి రెడ్డి ఎలా పరిష్కరించింది అనేది ఇందులో చూపించారు. ఈ సిరీస్ కి రెండవ భాగం కూడా ఉన్నట్టు సిరీస్ ఎండింగ్ ఉంటుంది.

కానీ అది ఇప్పటి వరకు రాలేదు.  ఈ వెబ్ సిరీస్ చూసిన వాళ్ళందరికీ కూడా ఇది చాలా నచ్చింది. అప్పట్లో వెబ్ సిరీస్ అంటే కొత్త. ఈ సిరీస్ 2019 లో వచ్చింది. ఆ సమయానికి వెబ్ సిరీస్ అప్పుడప్పుడే తెలుగు కి వస్తున్నాయి. అలాంటి సమయంలో ఈ వెబ్ సిరీస్ వచ్చింది. మంచి ఆదరణ సంపాదించుకుంది. నటీనటుల పర్ఫార్మెన్స్ ని అందరూ మెచ్చుకున్నారు. ఒక ప్రశ్నని సిరీస్ ఎండింగ్ లో వదిలేశారు. దానికి సమాధానం రెండవ సీజన్ వస్తే అందులో ఇస్తారు. దాంతో ఇప్పుడు దీనికి రెండవ సీజన్ ఎప్పుడు వస్తుంది అని అందరూ ఎదురు చూస్తున్నారు.


End of Article

You may also like