Ads
Amma Chethi vanta Bhargavi: మనం ఎక్కడకి వెళ్లి ఏమి తిన్నా… అమ్మ చేతి వంట తినగానే వచ్చే ఫీలింగ్ దేనికీ రాదు. మనకి వంట చేసుకోవడం వచ్చినా కూడా.. మన అమ్మ చేసిన వంట లాగ లేదని మనకి చాలా సార్లు అనిపిస్తూ ఉంటుంది. ప్రాక్టీస్ మీద, అమ్మ చెప్పే టిప్స్ తోనూ.. మనం అమ్మలా వంట చేసినా కూడా మనకి వచ్చే సాటిస్ఫాక్షన్ వేరు. అయితే.. ఇలాంటి టిప్స్ చెప్పడానికి, వంట చేసే టపుడు మెళకువలు నేర్పడానికి అందరికి అవకాశం ఉండదు. amma cheti vanta anchor bhargahvi
Video Advertisement
చాలా మంది వంట చేయడానికి యు ట్యూబ్ పై డిపెండ్ అవుతారు.. యు ట్యూబ్ లో చూసి చేసే వంటలు సరిగ్గా కుదరవు అని కూడా చెప్తూ ఉంటారు. అయితే.. ఈ అపోహలన్నిటికి పక్కకు నెట్టి అమ్మ చేతి వంట ను మనం కూడా సులువు గా చేసుకునేలా టిప్స్ చెప్తూ వంటల వీడియోస్ తో చాలా మంది తెలుగు వారికి దగ్గరయ్యారు భార్గవి. “అమ్మ చేతి వంట” ఛానెల్ తో ఆమె చాలామందికి పరిచయమయ్యారు. రకరకాల వంటలను, మన పాత కాలం నాటి వంటలను కూడా కమ్మ గా ఎలా చేసుకోవాలో ఆమె వీడియో లో చేసి చూపిస్తున్నారు. అయితే.. ఈ ఛానెల్ స్టార్ట్ చేయడానికి వెనక ఆమె జర్నీ గురించి తెలుసుకుందాం.
భార్గవి రాజమండ్రి లో పుట్టి పెరిగారు. ఆమె బీఎస్సీ కంప్యూటర్స్ చదువుకున్నారు. డిగ్రీ పూర్తి అయ్యాక ఆమెకు వివాహం చేసారు. భార్గవి పెళ్లి అయినా తరువాత భర్తతో విశాఖపట్టణం కు వచ్చేసారు. వెంట వెంటనే ఆమెకు ఇద్దరు సంతానం కలగడం తో ఇల్లు, పిల్లలతోనే బిజీ అయిపోయారు. ఓ సారి సంక్రాంతి పండగ కి పుట్టింటికి వెళ్లారు. ఈ సమయం లో ఆమె తల్లి గీత మహాలక్ష్మి.. “మనం చేసే వంటలను యు ట్యూబ్ లో పెడితే.. అందరు చూస్తారు కదా.. నువ్వు కూడా అలా చెయ్యి..” అంటూ ప్రోత్సహించారు. అలా ఆమె తల్లి చేసిన వంటలను ఆమె యూట్యూబ్ లో పోస్ట్ చేస్తూ వచ్చారు.
ఒక నెలలోనే ఆమె 90 వీడియో లను అప్ లోడ్ చేసారు. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మీ వంటలు ట్రై చేసి చూసాము.. చాలా బాగా వచ్చింది అంటూ రెస్పాన్స్ వస్తుండడం తో.. ఆమె మరిన్ని రకాల వంటలను చేసి పెట్టారు. మొదట్లో ఈ వీడియో లు పెట్టె విషయం లో సీరియస్ గా లేని భార్గవి.. తర్వాత్తర్వాత ఈ పని లో బిజీ అయిపోయారు. వంట చేసే సమయం లో వీడియో లు తీసి పెట్టుకునేవారు. 2017 మే 31 న “అమ్మ చేతి వంట” ఛానల్ స్టార్ట్ అయింది.
అయితే.. అప్పటినుంచి క్రమం గా వీడియోస్ అప్ లోడ్ చేస్తూ వచ్చారు భార్గవి. ఛానెల్ కి మంచి రెస్పాన్స్ రావడం తో వీడియోస్ విషయం లో కూడా ఆమె జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వంటలు చేసిన తరువాత అవి తన భర్త కు చూపించి.. బాగుంటేనే అవి యు ట్యూబ్ లో అప్ లోడ్ చేస్తాను అని చెప్తున్నారు. నెట్ లో చూసిన వీడియో లను ఫాలో అయితే.. ఆ వంటలు బాగుండవని అంటుంటారని.. ఆ అపోహ పోగొట్టడం కోసమే జాగ్రత్త తీసుకుంటానన్నారు. మొదట్లో అంత గా వ్యూస్ వచ్చేవి కాదు. కానీ, థంబ్ నెయిల్స్ ఎలా పెట్టుకోవాలి, టైటిల్స్, టాగ్స్ వంటి విషయాల్లో కూడా అవగాహనా పెంచుకుని ప్రొఫషనల్ గా వీడియోస్ పెట్టడం ప్రారంభించారు.
ఆ తరువాత, రీసెంట్ గా వ్యూయర్స్ కోసం “మనలో మన మాట” ఛానల్ ను కూడా ప్రారంభించారు. వ్యూయర్స్ కు ఉపయోగపడే సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా అందిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె మాట్లాడుతూ..”కుటుంబ సభ్యుల ప్రోత్సాహం తోనే ఈ స్థాయికి రాగలిగానని.. ఛానల్ ను కొత్తగా పెట్టిన వారు వ్యూస్ రాలేదని కుంగిపోకుండా.. మంచి కంటెంట్ ఇవ్వాలని సూచించారు.
watch video:
article sourced from: sakshi news
Amma Chethi vanta Bhargavi Social Detailes:
Facebook Id : Amma Cheti Vanta
Twitter Id: అమ్మ చేతి వంట
Phone Number : N/A
End of Article