OTT లోకి వచ్చేసిన ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా..! ఎందులో స్ట్రీమ్ అవుతోంది అంటే..?

OTT లోకి వచ్చేసిన ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా..! ఎందులో స్ట్రీమ్ అవుతోంది అంటే..?

by Mohana Priya

Ads

గత సంవత్సరం బేబీ సినిమాతో మన ముందుకి వచ్చారు ఆనంద్ దేవరకొండ. ఇప్పుడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన గం గం గణేశా సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా గత మే 31వ తేదీన రిలీజ్ అయ్యింది. సినిమా విడుదల అయ్యి నెల రోజులు కూడా కాకముందే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది. తెలుగు భాషలో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఇంక ఈ సినిమా కథ విషయానికి వస్తే, గణేష్ (ఆనంద్ దేవరకొండ), తన స్నేహితుడు (జబర్దస్త్ ఇమాన్యుయల్) తో కలిసి దొంగతనాలు చేస్తూ ఉంటాడు. గణేష్ ఒక అనాధ. గణేష్ శృతి (నయన్ సారిక) తో ప్రేమలో పడతాడు. కానీ శృతి ఇంకొకరు నచ్చడంతో గణేష్ ని వదిలేస్తుంది. ఆ తర్వాత గణేష్ ఒక వజ్రాన్ని దొంగిలిస్తాడు.

Video Advertisement

అనుకోకుండా ఆ వజ్రం ఒక వినాయకుడి విగ్రహంలోకి వెళ్తుంది. అంతే కాకుండా, ఒక 100 కోట్లు కూడా వినాయకుడు విగ్రహంలో ఉంటాయి. అసలు ముంబై నుండి తెస్తున్న వినాయకుడి విగ్రహంలోకి డైమండ్ ఎలా వెళ్ళింది? 100 కోట్లు ఎలా వెళ్లాలి? గణేష్ ఏం చేశాడు? గణేష్ ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నాడు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే. ఆనంద్ దేవరకొండ గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో కూడా పాత్ర డిఫరెంట్ గా ఉంటుంది. సినిమాలో కొన్ని స-స్పె-న్స్ సీన్స్, కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగా రాసుకున్నారు. సినిమా చూస్తున్నంత సేపు నిఖిల్ హీరోగా నటించిన స్వామి రారా సినిమా అక్కడక్కడ గుర్తొస్తుంది. వెన్నెల కిషోర్ కామెడీ సినిమాకి మరొక హైలైట్. కానీ కథనం చాలా రెగ్యులర్ గా అనిపిస్తుంది. తెలిసిన కథ.

కొన్ని చోట్ల ఎంగేజింగ్ గా అనిపించినా కూడా, కొన్ని చోట్ల మాత్రం ఫ్లాట్ గా అనిపిస్తుంది. కొన్ని సీన్స్ అయితే చాలా స్లోగా నడుస్తాయి. సినిమాలో ఒక స్ట్రాంగ్ పాయింట్ ని స్పష్టంగా చూపించినట్టు అనిపించదు. దర్శకుడు రాసుకున్న స్క్రిప్ట్ పేపర్ మీద బాగుంది. కానీ కొన్ని సీన్స్ తీయడంలో మాత్రం ఇంకా జాగ్రత్త తీసుకోవాలి అనిపిస్తుంది. మొత్తానికి గం గం గణేశా సినిమా ఒక్కసారి చూడగలిగే యావరేజ్ సినిమాగా నిలుస్తుంది.


End of Article

You may also like