GAM GAM GANESHA REVIEW : “ఆనంద్ దేవరకొండ” నటించిన ఈ సినిమా ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

GAM GAM GANESHA REVIEW : “ఆనంద్ దేవరకొండ” నటించిన ఈ సినిమా ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

గత సంవత్సరం బేబీ సినిమాతో మన ముందుకి వచ్చారు ఆనంద్ దేవరకొండ. ఇప్పుడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన గం గం గణేశా సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా ఇవాళ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

  • చిత్రం : గం గం గణేశా
  • నటీనటులు : ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక, జబర్దస్త్ ఇమాన్యూయల్, వెన్నెల కిషోర్.
  • నిర్మాత : కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి
  • దర్శకత్వం : ఉదయ్ బొమ్మిశెట్టి
  • సంగీతం : చైతన్ భరద్వాజ్
  • విడుదల తేదీ : మే 31, 2024

gam gam ganesha movie review

స్టోరీ :

గణేష్ (ఆనంద్ దేవరకొండ), తన స్నేహితుడు (జబర్దస్త్ ఇమాన్యుయల్) తో కలిసి దొంగతనాలు చేస్తూ ఉంటాడు. గణేష్ ఒక అనాధ. గణేష్ శృతి (నయన్ సారిక) తో ప్రేమలో పడతాడు. కానీ శృతి ఇంకొకరు నచ్చడంతో గణేష్ ని వదిలేస్తుంది. ఆ తర్వాత గణేష్ ఒక వజ్రాన్ని దొంగిలిస్తాడు. అనుకోకుండా ఆ వజ్రం ఒక వినాయకుడి విగ్రహంలోకి వెళ్తుంది. అంతే కాకుండా, ఒక 100 కోట్లు కూడా వినాయకుడు విగ్రహంలో ఉంటాయి. అసలు ముంబై నుండి తెస్తున్న వినాయకుడి విగ్రహంలోకి డైమండ్ ఎలా వెళ్ళింది? 100 కోట్లు ఎలా వెళ్లాలి? గణేష్ ఏం చేశాడు? గణేష్ ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నాడు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

రివ్యూ :

ఆనంద్ దేవరకొండ గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో కూడా పాత్ర డిఫరెంట్ గా ఉంటుంది. సినిమాలో కొన్ని స-స్పె-న్స్ సీన్స్, కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగా రాసుకున్నారు. సినిమా చూస్తున్నంత సేపు నిఖిల్ హీరోగా నటించిన స్వామి రారా సినిమా అక్కడక్కడ గుర్తొస్తుంది. వెన్నెల కిషోర్ కామెడీ సినిమాకి మరొక హైలైట్. కానీ కథనం చాలా రెగ్యులర్ గా అనిపిస్తుంది. తెలిసిన కథ. కొన్ని చోట్ల ఎంగేజింగ్ గా అనిపించినా కూడా, కొన్ని చోట్ల మాత్రం ఫ్లాట్ గా అనిపిస్తుంది. కొన్ని సీన్స్ అయితే చాలా స్లోగా నడుస్తాయి. సినిమాలో ఒక స్ట్రాంగ్ పాయింట్ ని స్పష్టంగా చూపించినట్టు అనిపించదు. దర్శకుడు రాసుకున్న స్క్రిప్ట్ పేపర్ మీద బాగుంది. కానీ కొన్ని సీన్స్ తీయడంలో మాత్రం ఇంకా జాగ్రత్త తీసుకోవాలి అనిపిస్తుంది.

సినిమా స్టార్ట్ అవ్వడం ఆసక్తికరంగా స్టార్ట్ అయినా కూడా, తర్వాత అవసరం లేని సీన్స్ చాలా వస్తాయి. ఇంక పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే, ఆనంద్ దేవరకొండ పాత్రకి తగ్గట్టుగా నటించారు. యాక్టివ్ గా కనిపించడం, అంతే యాక్టివ్ గా నటించడం మాత్రమే కాకుండా, డాన్స్ కూడా చాలా బాగా చేశారు. హీరోయిన్స్ ఇద్దరు, వెన్నెల కిషోర్, జబర్దస్త్ ఇమాన్యూయల్ కూడా బాగా నటించారు. చైతన్ భరద్వాజ్ అందించిన పాటలు బాగున్నాయి. ఆదిత్య జవ్వాది అందించిన సినిమాటోగ్రఫీ కూడా మరొక ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. నిర్మాణ విలువలు కూడా సినిమాకి తగ్గట్టుగా నీట్ గా ఉన్నాయి. స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం ఇంకా జాగ్రత్త తీసుకోవాల్సింది.

ప్లస్ పాయింట్స్ :

  • ఆనంద్ దేవరకొండ నటన
  • వెన్నెల కిషోర్ కామెడీ
  • ఎమోషనల్ సీన్స్
  • కొన్ని ట్విస్ట్ లు

మైనస్ పాయింట్స్:

  • కథనంలో లోపించిన క్లారిటీ
  • స్లోగా సాగే కొన్ని సీన్స్

రేటింగ్ :

2.5/5

ట్యాగ్ లైన్ :

కొన్ని సీన్స్ బాగున్నా కూడా, కొన్ని సీన్స్ మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. ఆసక్తికరమైన విషయాలని తెర మీద అంత ఆసక్తికరంగా చూపించలేకపోయారు. కానీ కొన్ని స-స్పె-న్స్ సీన్స్ బాగున్నాయి. దాంతో మొత్తంగా గం గం గణేశా సినిమా ఒక యావరేజ్ సినిమాగా నిలుస్తుంది.

watch trailer :

 


End of Article

You may also like