జబర్దస్త్ వల్ల ఫేమ్ అయిన యాంకర్ అనసూయ. బుల్లితెర మీదే కాదు అటు వెండి తెర మీద కూడా అవకాశాలు సంపాదిస్తూ ముందుకి దూసుకెళ్తుంది. ప్రస్తుతం అనసూయ. పవన్ కళ్యాణ్,క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాలో ముఖ్యపాత్రలో నటించబోతుంది. దాంతో పాటు అల్లు అర్జున్, సుకుమార్ సినిమాలో కూడా అనసూయ పాత్రే కథకు కీలకం అని చెబుతున్నారు.

ఇది ఇలా ఉంటె…కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అన్ని జిల్లాల్లో లాక్ డౌన్ అని ముఖ్యమంత్రులు తెలిపారు.ఈ క్రమంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి బియ్యంతో పాటు 1500 రూపాయలు అందచేస్తామని సీఎం కెసిఆర్ తెలిపారు. దీనిపై ట్విట్టర్ లో కేటీఆర్ కు రిప్లై ఇచ్చింది అనసూయ.

“సార్. ప్రభుత్వం చెప్పింది పాటించాలి.. కానీ కొన్ని ప్రొఫెషన్స్ విషయంలో మాత్రం ఈ పద్దతులు సడలించండి..మేం పని చేయకపోతే మాకు డబ్బులు రావు.. కానీ మేం మా ఇంటి రెంట్ కట్టుకోవాలి.. కరెంట్ బిల్లు కట్టుకోవాలి.. EMI భరించాల్సిందే.. నెలసరి బిల్స్ కూడా ఉంటాయి. కాబట్టి కాస్త మాపై దయ చూపించండి ” అంటూ ట్వీట్ చేసింది.

అనసూయ అలా ట్వీట్ చేసేసరికి ఓ రేంజ్ లో ట్రోల్ల్స్ చేసారు సోషల్ మీడియాలో.  కొందరు నెటిజెన్స్ ఆమెపై ఫైర్ అవుతున్నారు. ఎంతో రిచ్ అయిన మీరే ఇలా అంటే ఎలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ ట్రోల్ల్స్ పై అనసూయ స్పందించారు.

“అయ్య బాబోయ్.. ఏంటి ఇంత మందా? ఇంతమంది బుర్రలేని వాళ్లా? ఇంతమంది వితండవాదులా? ` మేము` అంటే `నేను` అనేసుకున్నారా?.. ఏం చేస్తాం లెండి.. కామన్‌సెన్స్ ఉంటే ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది. నేను భయపడుతున్నది రాబోయే పరిస్థితుల గురించి” అంటూ కామెంట్ చేసింది.

If you want to contribute content on our website, click here

Cryptoknowmics Sharing is Caring:
No more articles