“పరువు తీస్తున్నావ్..” అంటూ అనసూయని ట్రోల్ చేసిన నెటిజెన్.. రిప్లై తో ఇచ్చిపడేసిందిగా..!

“పరువు తీస్తున్నావ్..” అంటూ అనసూయని ట్రోల్ చేసిన నెటిజెన్.. రిప్లై తో ఇచ్చిపడేసిందిగా..!

by Sunku Sravan

Ads

రెండు తెలుగు రాష్ట్రాల్లో యాంకర్ అనసూయ అంటే తెలియని వారు ఉండరు. తన మాటలతోనే కాకుండా తన డ్రెస్సింగ్ స్టైల్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించింది ఆమె. అనసూయ స్టేజి పైకి ఎక్కింది అంటే ఏదో ఒక కొత్తదనంతో, హాట్ అందాలతో యువకులను ఉర్రూతలూగిస్తుంది. పొట్టి పొట్టి డ్రెస్సులతో మైమరపిస్తుంది. అయితే ఆమె వేసుకునే పొట్టి దుస్తులే ఆమె పాలిట శాపంగా మారాయి. మరి ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం..!

Video Advertisement

యాంకర్ అనసూయ ప్రస్తుతం సినిమాలతో చాలా బిజీగా ఉంది. ఆమె చిన్నచిన్న దుస్తులు వేసుకొని ఫోటోలు తీసి రెగ్యులర్ గా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. దీంతో యాంకర్ అనసూయ వేసుకునే డ్రెస్సు లపై ట్రోల్ చేయడం, కామెంట్లు చేయడం అనేవి కొత్తేమీ కాదు.

anasuya 1

ఆమె కూడా ఆ ట్రోల్స్ కి మరియు కామెంట్లకి తగ్గట్టుగానే ఉంటుంది. తనపై వచ్చేటువంటి కొన్ని కామెంట్లపై కూడా గట్టిగానే సమాధానం ఇస్తుంది అనసూయ. తాజాగా ఒక వ్యక్తి చేసిన కామెంట్ కు ఆమె బదులు ఎలా ఇచ్చిందో చూద్దాం.. ఇటీవల ఒక నెటిజన్ అనసూయ ట్విట్టర్ ను ట్యాగ్ చేస్తూ ” అనసూయ గారు మీరు ఇద్దరు పిల్లల తల్లి ” పొట్టి, పొట్టి డ్రెస్సులు వేసుకుంటావా.. తెలుగింటి ఆడపడుచుల పరువు తీస్తున్నవ్” అంటూ కామెంట్ లో రాశాడు.

anasuya

 

ఈ కామెంట్ పై అనసూయ కూడా ఈ ట్విట్ ని షేర్ చేస్తూ.. ఇలా అన్నది. “దయచేసి మీ పని మీరు చేసుకోండి, నన్ను నా పని చేసుకోనివ్వండి. మీరు ఈ విధంగా ఆలోచించి మగ జాతి పరువు తీస్తున్నారు” అని పోస్ట్ చేసింది. దీంతో ఈ ట్విట్ సోషల్ మీడియా వేదికగా చాలా వైరల్ అవుతున్నాయి. కొంతమంది అనసూయని సపోర్ట్ చేస్తూ ఉంటే, మరికొంతమంది మాత్రం అనసూయని వ్యతిరేకిస్తూ వస్తున్నారు.


End of Article

You may also like