బిగ్ బాస్‌కి పంపిస్తానని 2.5 లక్షలు తీసుకొని మోసం చేసారంటూ…బాండ్ పేపర్ షేర్ చేసిన యాంకర్ స్వప్న చౌదరి.!

బిగ్ బాస్‌కి పంపిస్తానని 2.5 లక్షలు తీసుకొని మోసం చేసారంటూ…బాండ్ పేపర్ షేర్ చేసిన యాంకర్ స్వప్న చౌదరి.!

by kavitha

Ads

బిగ్ బాస్‌ షోకి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ కి వెళ్ళిన వారికి క్రేజ్, పాపులారిటీ, డబ్బు వస్తాయనే విషయం కూడా తెలిసిందే. చాలామంది ఈ షోలో పాల్గొనడం ద్వారా డబ్బు, ఇమేజ్‌ వస్తుందని కలలు కంటుంటారు. అయితే చాలా తక్కువ మందికి మాత్రమే తాము ఆశించిన ఇమేజ్, డబ్బు వస్తుంది.

Video Advertisement

ఇక ఈ షోకి వెళ్లి అప్పటివరకు వారికున్న ఇమేజ్‌ని కూడా డ్యామేజ్ చేసుకుని బయటికి వచ్చినవారు ప్రతి సీజన్ లో ఉంటారు. రీసెంట్ గా ముగిసిన 7 సీజన్ ఫైనల్ తరువాత జరిగిన సంఘటన గురించి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్‌కి వెళ్లి ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్నవారే కాకుండా, ఆ షోకి వెళ్లాలనే కోరికతో డబ్బులిచ్చి మోసపోయిన ఇన్సిడెంట్ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
బిగ్ బాస్ షోకి ఎంత పాపులారిటీ క్రేజ్ ఉన్నప్పటికీ, షో చుట్టూ అదే స్థాయిలో వివాదాలు చోటుచేసుకుంటున్నాయి.  రీసెంట్ గా బిగ్ బాస్‌ సీజన్ 7 ముగిసిన విషయం తెలిసిందే. గ్రాండ్ ఫినాలే తరువాత చోటు చేసుకున్న ఘటనలు, రన్నర్ పై దాడి, విజేత అరెస్ట్ ఎంత సంచలనం సృష్టించాయో తెలిసిందే. తాజాగా సీజన్ 7లో పాల్గొనాలనే ఆశతో యాంకర్ స్వప్న చౌదరి డబ్బు ఇచ్చియానట్టు, కానీ తనకౌ ఛాన్స్ ఇవ్వలేదని ఓ వీడియోని రిలీజ్ చేసింది. ఆ వీడియోలో ఆమె ” నా పేరు స్వప్న చౌదరి అమ్మినేని, యాంకర్ అండ్ యాక్టర్. మిస్టరీ, నమస్తే సేట్ జీ అనే సినిమాల ద్వారా ఇండస్ట్రీకి రావడం జరిగింది.
కొంతమందికి అయితే నేను తెలుసు యాంకర్ స్వప్న గా, యాక్టర్ స్వప్నగా చాలామందికి తెలుసు. నాకు బిగ్ బాస్‌కి వెళ్లడం అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే, నేను నిద్రపోయినప్పుడు కనే కలలో సైతం బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నట్టే కలకంటాను. బిగ్ బాస్ సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకూ చాలా ఇష్టంగా చూశాను. బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్‌గా పంపిస్తానని చెప్పి, నా దగ్గర నుండి రెండు లక్షల యాబై వేలు తీసుకున్నారు. శని, ఆదివారాల్లో వేసుకునే క్యాస్ట్యూమ్స్‌కి డబ్బులు కావాలి అని, తమ్మలి రాజు అనే వ్యక్తి  రెండున్నర లక్షలు తీసుకున్నారు. అందుకు సంబంధించి బాండ్ పేపర్‌పై అగ్రిమెంట్ ఇచ్చారు. గత జూన్ లో డబ్బు ఇచ్చాను.
లాస్ట్ మూమెంట్ వరకు నువ్వు కన్ఫామ్ అన్నారు. కానీ వేరే వాళ్ల నేను ట్రై చేస్తానని చెప్తే, అవసరం లేదు. నేనే పంపిస్తానని అన్నారు. డబ్బు ఎందుకని అడిగితే, పీఆర్ రేటింగ్ పెంచుకోవడం కోసం, కాస్ట్యూమ్స్ కి అని చెప్పాడు. డబ్బు తీసుకోవాడమే కాకుండా, నాతో ఫొటో షూట్ చేయించారు. అందుకు రూ. 25 వేల వరకు ఖర్చు అయ్యింది. జూన్‌లో డబ్బు ఇస్తే, ఇప్పటికి 8 నెలలు అవుతుంది. ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్నానంటే బిగ్ బాస్ సీజన్ 7లో ఛాన్స్ రాలేదు కదమ్మా, సీజన్ 8లో పంపిస్తానని చెప్పి డబ్బు  ఇవ్వలేదు. కానీ నాకు ఒక అగ్రిమెంట్ అయితే రాసి ఇచ్చారు.
ఇందులో సీజన్ 7 లో పంపలేకపోయాను. డబ్బు మాత్రం డిసెంబర్ వరకు ఇస్తానని రాయడం జరిగింది. ఇందుకోసం ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకుని ఇచ్చాను. జనవరి 6న ఇస్తానని చెప్పాడు. ఆ రోజున కాల్ చేస్తే పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇస్తావా ఇచ్చుకో.. ప్రెస్ మీట్ పెడతావ పెట్టు అని మాట్లాడాడు. బిగ్ బాస్ మేనేజ్మెంట్ వాళ్లు ఇటువంటి చీడ పురుగుల్ని ఎంకరేజ్ చేయవద్దు. ఇలాంటి వ్యక్తులను గమనించండి. బిగ్ బాస్‌కి పంపిస్తాం అంటూ డబ్బులు తీసుకుని చీట్ చేస్తున్నారు. దయచేసి నాకు సపోర్ట్ చేయండి. సీజన్ 8 లో అయినా నేను వెళ్ళాలి. నా అమౌంట్ నాకు రావాలి” అంటూ స్వప్న చౌదరి తన ఆవేదన వ్యక్తం చేసింది.

Also Read: GUNTUR KAARAM DIALOGUES IN TELUGU, గుంటూరు కారం సినిమా డైలాగ్స్

 


End of Article

You may also like