టాప్ ప్లేస్ కోసం అందరితో పడుకుంది అని ఈజీగా అనేస్తారు.. సడన్ గా ఈ పోస్ట్ ఏంటి రష్మీ..?

టాప్ ప్లేస్ కోసం అందరితో పడుకుంది అని ఈజీగా అనేస్తారు.. సడన్ గా ఈ పోస్ట్ ఏంటి రష్మీ..?

by Anudeep

Ads

ఎక్సట్రా జబర్దస్త్ తో పాటు పలు ప్రోగ్రామ్స్ లో కనిపించి మెరిసే యాంకర్ రష్మీ గౌతమ్. అటు డాన్స్ పెర్ఫార్మన్స్ అయినా.. యాంకర్ గా ప్రేక్షకులని అలరించడంలో అయినా రష్మీ దిట్ట అనే చెప్పాలి. తొలిసారిగా జబర్దస్త్ షో లో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తరువాత ఎక్స్ట్రా జబర్దస్త్ కు యాంకర్ గా మారారు.

Video Advertisement

ఆ తరువాత ఢీ షో లో కూడా సుధీర్ తో కలిసి జంటగా యాంకరింగ్ చేసారు. వీరిద్దరి జోడికి ఎంత పాపులారిటీ ఉందొ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టీఆర్పీల కోసమే వీరి మధ్య కెమిస్ట్రీ ఉన్నట్లు చూపించినా, ఫ్యాన్స్ మాత్రం వీరిని రియల్ జోడిగా ఫిక్స్ అయిపోయారు.
rashmi 1

కొంతమంది నెటిజన్స్ డైరెక్ట్ గా వీళ్ళిద్దరిని పెళ్లి చేసుకోవాలని సజెస్ట్ చేస్తూ ఉంటారంటే.. వీరి కెమిస్ట్రీ కి ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందొ అర్ధం చేసుకోవచ్చు. మరో వైపు రష్మీ కూడా కేవలం యాంకరింగ్ రంగంలోనే పరిమితం కాకుండా సినిమాల్లో కూడా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి సినిమాలో కూడా రష్మీ ఓ ఛాన్స్ కొట్టేసిందని వార్తలు కూడా వచ్చాయి.

ఇది ఇలా ఉంటె.. రష్మీ సోషల్ మీడియాలో కూడా చాలా ఆక్టివ్ గా ఉంటారు. ఆమె జంతు ప్రేమికురాలు కావడంతో జంతువులకు సంబంధించిన పోస్ట్ లు, తన లేటెస్ట్ ఫోటోలు, అప్ డేట్ లు షేర్ చేస్తూ నిత్యం అభిమానులకు టచ్ లోనే ఉంటుంది. అయితే.. రీసెంట్ గా ఆమె షేర్ చేసిన పోస్ట్ చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ మీమ్ పై రష్మీ స్పందించింది. టాప్ పొజిషన్ కి చేరుకున్న వారిని చూసి.. కచ్చితంగా అందరితో పడుకుని ఉంటుంది.. అన్న అర్ధంతో వచ్చిన మీమ్ ను షేర్ చేసిన రష్మీ అవును అందరు ఎంతో ఈజీ గా ఆ మాటని అనేస్తూ ఉంటారు అని కాప్షన్ ను జత చేసింది.


End of Article

You may also like