Ads
యాంకర్ శివజ్యోతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యాంకర్ గా కెరీర్ ను ప్రారంభించిన శివజ్యోతి తెలంగాణ యాసతో మాట్లాడుతూ తీన్మార్ సావిత్రిగా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. ఆ తరువాత బిగ్ బాస్ షోలో పాల్గొని మరింత పాపులరిటీని పెంచుకుంది.
Video Advertisement
ఇస్మార్ట్ జోడి, బుల్లితెర పై పండుగల సమయాలలో ప్రసారం అయ్యే వేడుకలలో పాల్గొంటూ సందడి చేస్తూ శివజ్యోతి ప్రేక్షకులను అలరిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శివజ్యోతి సొంతంగా యూట్యూబ్ ఛానల్ ని కూడా ప్రారంభించింది. ఆ ఛానల్ లో ఎన్నో విషయాలను తన ఫ్యాన్స్ తో షేర్ చేస్తుంటారు.
శివజ్యోతి ఏ విషయం అయినా సరే సూటిగా మాట్లాడుతుంటారు. జ్యోతక్క అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టిన శివజ్యోతి తాజాగా తన ఛానెల్ లో హోం టూర్ వీడియోను చేసింది. మణికొండలో ఆమె తీసుకున్న ఫస్ట్ హౌజ్ గురించి వివరించింది. ఆ ఇంటిని 2019లో కొనుగోలు చేసినట్లుగా, ఫిబ్రవరి 2020లో గృహప్రవేశం చేశామని తెలిపారు.
కొద్ది రోజుల క్రితమే ఆ ఇంటికి మారినట్లుగా చెప్తూ తన ఇంటిని, ఇంటి లోపల అంతా చూపించింది. ఇంటి లోపలి ఇంటీరియర్ ను దగ్గరుండి మరి డిజైన్ చేయించుకున్నానని వెల్లడించింది. ఇక వీడియో చివర్లో ఇంటిని అమ్మాలని అనుకున్నట్లుగా, తాము ఆ ఇంట్లో ఉండట్లేదని, ఆ ఇంటిని చాలా ఇష్టంగా కొన్నట్లు తెలిపింది.
తాను న్యూస్ ఛానల్ మొదలు పెట్టానని, అయితే ఆ ఛానెల్ కి వ్యూస్ రాలేదని, డిప్రెషన్‌కు గురి అయ్యానని తెలిపింది. ఈ ఇల్లు లక్ అనుకున్నానని, అందుకే ఛానల్ సక్సెస్ అవుతుందని భావించాను. కానీ అలా జరగలేదని, రెండు ఇళ్ళ ఈఎంఐలు కట్టాలని. అందుకే ఈ ఇంటిని అమ్మాలని అనుకున్నట్లుగా వెల్లడించింది. ఊరికనే నన్ను తిట్టకండి. అలా చేయడం వల్ల చాలా ప్రభావం చూపిస్తుంది’ అని శివజ్యోతి కన్నీరు పెట్టుకుంది.
Also Read: ఈ సెలబ్రిటీ జంట కథ తెలుసా..? వీరి ప్రేమ ఎలా మొదలయ్యింది అంటే..?
End of Article