కోపాన్ని తగ్గించుకోవడం కోసం బాలయ్య చెప్పిన ఈ 5 టిప్స్ గురించి తెలుసా..? ఓ సారి లుక్ వేయండి..!

కోపాన్ని తగ్గించుకోవడం కోసం బాలయ్య చెప్పిన ఈ 5 టిప్స్ గురించి తెలుసా..? ఓ సారి లుక్ వేయండి..!

by Anudeep

Ads

నందమూరి నటసింహం బాలయ్య బాబుకి ఉన్న ఫాలోయింగ్ మాములుగా ఉండదు. అఖండ సినిమా థియేటర్లలో ప్రసారం అవుతోంది. ఈ సినిమాను థియేటర్లలో చూసిన వారిని ఎవరిని అడిగినా.. “జై బాలయ్య” అనే చెప్తారు. నందమూరి తారక రామారావు గారి తనయుడిగా బాలకృష్ణకి అవకాశాలు మాత్రమే వచ్చాయి.

Video Advertisement

కానీ, ఆయన ప్రతిభని మాత్రం ఆయనే నిరూపించుకుని ఈరోజు ఈ స్థాయిలో నిలిచారు. నటసింహం అన్న బిరుదుని కూడా సొంతం చేసుకున్నారు. ఆయన అరిచినా, కోప్పడినా కూడా అభిమానంగానే తీసుకునే వేలకొద్దీ అభిమానులను బాలయ్య సొంతం చేసుకున్నారు.

prabhas 1balayya

తింటే గారెలే తినాలి.. అలాగే బాలయ్య బాబు సినిమాను చూస్తే థియేటర్ లోనే చూడాలి. అంతటి అభిమానాన్ని, గ్రేస్ ని సంపాదించుకున్నారు బాలయ్య. అవసరమైన వారికి సాయం చేస్తూ రియల్ లైఫ్ లోను హీరోగా నిలిచారు. ఆయన కుడి చేత్తో సాయం చేస్తే.. ఎడమ చేతికి కూడా కూడా తెలియదు. అలాంటి సాయాలు ఎన్నో చేసారు. అందుకే ఫ్యాన్స్ కు ఆయన అంటే ప్రత్యేకం.

అయితే.. బాలయ్య బాబుకి కూడా కొంచం కోపం ఎక్కువే అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఒక్కోసారి అభిమానులపై ఆయన అలా ప్రవర్తించినా బాలయ్య బాబుకి కోపం ఉండదు అని ఆయన అభిమానులే చెబుతుంటారు. ఆయన చేసే మంచి పనులు, సాయాలు చాలా మందికి తెలియవు. బయటకు తెలియకుండానే ఆయన సాయం చేస్తుంటారు.

1 balayya

ఇది అలా ఉంచితే.. కోపాన్ని తగ్గించుకోవడం గురించి బాలయ్య ఓ సారి చెప్పుకొచ్చారు. ఓ ఐదు టిప్స్ ను ఆయన తెలిపారు. మొదటిది.. మాట్లాడే ముందు ఆలోచించుకుని మాట్లాడమని సూచించారు. రెండవది.. కోపం వచ్చినప్పుడు ప్రతిగా మాట్లాడడం కాకుండా అంకెలు లెక్కపెట్టమని చెప్పారు. మూడవది.. అవతలివారిపై అరవడం కాకుండా, అసలు ప్రాబ్లెమ్ ఏంటిది అన్న సంగతి ఆలోచించాలన్నారు. నాలుగోది.. ఏదైనా తగాదా వచ్చిన మనసులో పెట్టుకోకుండా మనస్ఫూర్తిగా క్షమించాలన్నారు. చివరగా.. ఐదవది ఏంటంటే తన కోపమే తన శత్రువు.. తన శాంతమే తనకు రక్షా అని గుర్తు చేసారు. కోపం మనకే శత్రువు కాబట్టి శాంతంగా ఉండడం అలవర్చుకోవాలన్నారు.

Watch Video:


End of Article

You may also like