• చిత్రం : బుట్ట బొమ్మ
 • నటీనటులు : అనిఖా సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట.
 • నిర్మాత : సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య
 • దర్శకత్వం : శౌరి చంద్రశేఖర్ టి రమేష్
 • సంగీతం : గోపి సుందర్
 • విడుదల తేదీ : ఫిబ్రవరి 4, 2023

butta bomma movie review

Video Advertisement

స్టోరీ :

సత్య (అనిఖా సురేంద్రన్) ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. అరకులో తన తల్లి, తండ్రి, చెల్లెలితో కలిసి ఉంటుంది. ఒక ఫోన్ కొనుక్కొని అందులో ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసి ఫేమస్ అయిపోవాలి అని సత్య అనుకుంటుంది. ఒకరోజు సత్య అనుకోకుండా ఒక రాంగ్ నెంబర్ కి డయల్ చేస్తుంది. అవతల పక్క ఫోన్ ఎత్తిన మురళి (సూర్య వశిష్ట) తో పరిచయం ఏర్పడుతుంది. వారిద్దరూ ఒకరిని ఒకరు చూసుకోకుండానే ప్రేమించుకుంటారు. తర్వాత వారిద్దరూ ఒకసారి కలుసుకోవాలి అనుకుంటారు. ఆరోజు ఆర్కే (అర్జున్ దాస్) తో వాళ్లకి గొడవ జరుగుతుంది. అసలు వారికి ఆర్కేకి మధ్య గొడవ ఏంటి? వాళ్ళు ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? ఆ గొడవ నుండి వాళ్ళు ఎలా బయటపడ్డారు? ఆరోజు మొత్తం ఏం జరిగింది? ఇదంతా తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

butta bomma movie review

రివ్యూ :

చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఎంతో మంది తర్వాత హీరో హీరోయిన్లుగా పరిచయం అయ్యారు. ఇప్పుడు ఎన్నో తమిళ్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అనిఖా సురేంద్రన్ కూడా హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అది కూడా ఒక తెలుగు సినిమాతో హీరోయిన్ గా తన కెరీర్ మొదలు పెట్టింది. సినిమా ట్రైలర్ చూసినప్పుడు ఇది ఒక లవ్ స్టోరీ అని అర్థం అయ్యే ఉంటుంది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా లవ్ స్టోరీ లాగానే సాగుతుంది.

butta bomma movie review

కానీ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి సస్పెన్స్ మొదలవుతుంది. అప్పటివరకు ఒకలాగా నడిచిన కథ అప్పటినుండి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాగా నడుస్తుంది. సినిమా మొత్తం చాలా సహజంగా ఉంటుంది. ఇది రీమేక్ సినిమా అయినా కూడా తెలుగు సినిమాలా కనిపించడానికి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్కడో అరకులో ఒక చోట ఉండే కుటుంబం. అందులో ఉండే ఒక అమ్మాయి. తనకి సంబంధించిన కథ అని చూపించడం సినిమాకి చాలా పెద్ద ప్లస్ అయ్యింది.

butta bomma movie review

ఇంక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నటీనటులు అందరూ కూడా తమ పాత్రలకు తగ్గట్టుగా చేశారు. కానీ సినిమా మొత్తానికి పెద్ద హైలైట్ అయింది మాత్రం అర్జున్ దాస్. తెలుగులో అర్జున్ దాస్ తమిళ్ సినిమాల ద్వారా చాలా ఫేమస్ అయ్యారు. అంతకుముందు గోపీచంద్ హీరోగా నటించిన ఆక్సిజన్ సినిమాలో అర్జున్ దాస్ గోపీచంద్ తమ్ముడి పాత్రలో నటించారు.

butta bomma movie review

ఆ తర్వాత ఇప్పుడు ఈ సినిమాలో నటించారు. తెలుగు సినిమాలో నటించడం మాత్రమే కాకుండా ఈ సినిమాలో డబ్బింగ్ కూడా తానే చెప్పుకున్నారు. దాంతో ఆ పాత్ర సినిమాకి హైలైట్ అయింది. పాటలు కూడా సినిమాకి తగ్గట్టుగా ఉన్నాయి. సినిమా సెకండ్ హాఫ్ లో బాగున్నా కూడా ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొన్ని సీన్స్ మరీ సాగదీసినట్టుగా అనిపిస్తాయి. స్క్రీన్ ప్లే కూడా చాలా స్లోగా ఉంటుంది.

ప్లస్ పాయింట్స్ :

 • దర్శకుడు ఎంచుకున్న పాయింట్
 • నటీనటులు
 • సినిమాటోగ్రఫీ
 • సెకండ్ హాఫ్

మైనస్ పాయింట్స్:

 • సినిమా నిడివి
 • అక్కడక్కడ సాగదీసినట్టుగా ఉండే కొన్ని సీన్స్

రేటింగ్ :

3/5

ట్యాగ్ లైన్ :

ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా చూద్దాం అనుకునే వారికి, అలాగే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలని ఇష్టపడే వారికి బుట్ట బొమ్మ సినిమా ఒక్కసారి చూడగలిగే సినిమాగా నిలుస్తుంది.

watch trailer :