సీనియర్ నటి అన్నపూర్ణ ఆమె పేరుకు సార్ధకురాలు. ఆమె పేరు వినగానే అన్నం పెట్టె ఒక అమ్మ భావన. ఆ పేరుకు తగ్గట్టుగానే అన్నపూర్ణ గారు చాలా సినిమాలలో తల్లి పాత్రలతో మనందరినీ మెప్పించారు. అన్నపూర్ణ 13 వ ఏటనుండి అనేక నాటకాలలో వివిధ పాత్రలు వేస్తూ ఉండేవారు . అలా నాటకాలు వేస్తూ ఉన్న సమయం లో ఒక రోజు విశాఖపట్నం లో ” నీడ లేని ఆడది “సినిమా తీస్తున్న సమయం లో ఒక కారెక్టర్ ఆర్టిస్ట్ మద్రాసు నుండి రావాల్సి ఉంది. అయితే ఆమె రైలు దొరకని కారణం తో రాలేకపోయారు. వెంటనే అన్నపూర్ణని విజయవాడ నుండి పిలిపించారు. అదే తనకు నీడనిచ్చిన సినిమా.

annapurna
ఒకటి రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన తర్వాత తల్లి,వదిన ,చెల్లి పాత్రలు చేసారు. ఎక్కువగా తల్లి పాత్రలు వేస్తూ ఆ పాత్రకు ప్రాణం పోసేవారు. అన్నపూర్ణ ఎక్కువగా సత్యనారాయణ ,రావుగోపాల్ రావు,జగ్గయ్య,గొల్లపూడి భార్య గా నటించేవారు. అయితే రావుగోపాల్ రావు తనతోనే భార్య గా నటించాలి అనే వారు అని మాటల్లో చెప్పుకొచ్చారు. దాదాపు అందరి హీరో లకి తల్లిగా నటించారు. అప్పట్లో ఎన్టీరామారావు కు ” సింహం “నవ్వింది సినిమాలో తల్లి గా నటించారు. తర్వాత ఏ న్ ఆర్ కి తల్లిగా నటించడానికి అవకాశం వచ్చినా స్క్రీన్ మీద అన్నపూర్ణ చిన్నగా ఏ న్ ఆర్ వయసు పెద్దదిగా కనిపిస్తుండడం తో అక్కినేని నాగేశ్వర్ రావు సినిమాలలో అన్నపూర్ణను తీసుకునేవారు కాదుట. ఈ మధ్య కాలం లో కూడా అన్నపూర్ణ యువ హీరో ల చిత్రాల్లో నటిస్తూ అలరిస్తున్నారు .ఈ సంగతులన్నీ ఈ మధ్య జరిగిన ఇంటర్వ్యూ లో చెప్తూ గుర్తు చేసుకున్నారు.