వెండితెరపై ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి అన్నపూర్ణమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకపక్క వెండితెరపై వరుస సినిమాల్లో నటిస్తూనే ఆమె అప్పుడప్పుడు బుల్లితెరపై కూడా తలుక్కుమంటున్నారు.

Video Advertisement

ప్రస్తుతం బుల్లితెర లో అత్యంత పాపులారిటీ సంపాదించిన టీవీ షోలు జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలు. ఈ ప్రోగ్రాములు అత్యధిక రేటింగ్ తో దూసుకుపోతున్నాయి. ఎంతోమంది బుల్లితెర కమెడియన్స్ ను సినిమా ఇండస్ట్రీకి అందించిన ఘనత ఈ టీవీ షో కే దక్కింది అనడంలో సందేహం లేదు. ఈటీవీ కే ఈ రెండు షో లు బ్రాండ్ గా మారాయి అనేది ఎందరో విమర్శకుల అభిప్రాయం.

ఇవి కూడా చదవండి: “ఇది కదరా మనకి కావాల్సింది..!” అంటూ… పవన్ కళ్యాణ్ “తమ్ముడు” సినిమా స్పెషల్ షో పై 10 మీమ్స్..!

ప్రస్తుతం జబర్దస్త్ ప్రోగ్రామ్ లో ఆటో రామ్‌ ప్రసాద్‌ టీమ్‌ లో మెయిన్ కంటెస్టెంట్ గా ఉన్న అన్నపూర్ణమ్మ షోలో తెగ సందడి చేస్తూ కనిపిస్తున్నారు. ఆమె ఈ వయసులో కూడా జబర్దస్త్ పంచ్ లతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. అన్నపూర్ణమ్మ కు రామ్‌ ప్రసాద్‌ రెగ్యులర్ గా స్కిట్ లో పాత్ర ఉండేలా చూస్తున్నారు. దీంతో ఈమె జబర్దస్త్ లో అధికంగా కనిపిస్తూ గతంలో కంటే ఇప్పుడే ఎక్కువ గుర్తింపును దక్కించుకుంటున్నారు.

annapurnamma - Twitter Search / Twitter

ఇలా తమదైన శైలిలో అన్నపూర్ణమ్మ జోకులు వేస్తూ కమెడియన్ల తో కలిసి జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాల్లో నటిస్తూ మరింత పాపులర్ అయ్యారు.అన్నపూర్ణమ్మ రెమ్యూనరేషన్ గురించి అనేక వార్తలు వస్తున్నాయి.ఒక్కో కాల్ షీట్ కి ఆవిడ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారు అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటు జబర్దస్త్ అటు శ్రీదేవి డ్రామా కంపెనీ రెండు ప్రోగ్రామ్లకు గాను మల్లె మాల వారు

Tollywood actress Annapurna's daughter commits suicide | Telugu Movie News - Times of India
అన్నపూర్ణమ్మకు భారీగానే పారితోషకం ముట్ట చెబుతున్నారని సమాచారం. విశ్వసనీయ వర్గాల వార్త ప్రకారం అన్నపూర్ణమ్మకు ఒక్కో కాల్ షీట్ కు రెండున్నర లక్షల వరకు ఇస్తున్నారు అని టాక్ ఉంది. ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న చాలా మంది ప్రముఖ కమీడియన్స్ తో పోల్చుకుంటే ఎక్కువనే చెప్పవచ్చు. టాలెంట్ కి వయసుకి సంబంధం లేదు అనేదానికి ఇప్పుడు అన్నపూర్ణమ్మ ఒక పెద్ద నిదర్శనం.

ఇవి కూడా చదవండి: ఈ రెండు ఫోటోల మధ్య రెండు తేడాలు ఉన్నాయి…అవి ఏంటో కనిపెట్టగలరా.?