Ads
ఆచార్య సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇటీవలే చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ లో పాల్గొంది. ఈ ప్రెస్ మీట్ లో చిరంజీవి చేసిన అల్లరి మాములుగా లేదు. అయితే.. ఈ సందర్భంగా చిరంజీవి చేసిన అల్లరిపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఇక చిరంజీవి అల్లరి చూసి ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. సాధారణంగా చిరంజీవి ఆన్ స్క్రీన్ అయినా, ఆఫ్ స్క్రీన్ అయినా హుందాగానే ఉంటారు. అప్పుడప్పుడు అల్లరి చేసి ఫన్ క్రియేట్ చేస్తుంటారు.
Video Advertisement
ఒక్కోసారి హీరోయిన్స్ పై ఆయన చేసే నాటీ కామెంట్స్ ఓ రేంజ్ లో వైరల్ అవుతూ ఉంటాయి. రచ్చ ఆడియో ఫంక్షన్ లో తమన్నా పై, తాప్సి మిషన్ ఇంపాజిబుల్ ఈవెంట్ లో తాప్సి పైనా ఆయన చేసిన సరదా కామెంట్స్ ను ప్రేక్షకులు ఇంకా మర్చిపోనే లేదు.
watch video:
ఈలోపే ఆయన మరోసారి తన చిలిపి కోణాన్ని బయటపెట్టారు. మీడియా ముందు ఫోజులు ఇవ్వబోతూ చిరు అల్లరి చేసారు. ఫోటోలు దిగిన తరువాత.. అందరు వెళ్లిపోతుండగా.. మరోసారి ఫోటోలు దిగాలంటూ కొందరు కోరారు. దీనితో చిరంజీవి వెళ్లిపోతున్నా పూజాని, రామ్ చరణ్ ను పిలిచారు. రామ్ చరణ్ ని రావద్దని సైగ చేసి పూజతో ఆమెను బంధించినట్లు ఫోజు ఇస్తూ ఫోటో దిగారు. ఈ ఫోటో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే స్టేజి మీదకి వెళ్ళడానికి ముందే మరో సన్నివేశం కూడా చోటు చేసుకుంది. పూజ హెగ్డే చిరంజీవి పక్కనే కూర్చుంది.
అయితే.. ఆమెని స్టేజి పైకి పిలవగానే వెళ్లే లోపు ఆమె కట్టుకున్న చీర కొంగు మెగాస్టార్ కాలి కింద ఉండిపోవడంతో పూజ అక్కడే ఆగిపోతుంది. వెంటనే అది చూసిన మెగాస్టార్ కాలు పక్కకి తీయడంతో పూజ నవ్వుకుంటూ స్టేజి పైకి వెళ్ళిపోతుంది. అయితే ఇదే సీన్ అన్నయ్య సినిమాలో కూడా ఉంటుంది. సౌందర్య తో మాట్లాడుతూ ఉన్న చిరంజీవి ఆమెకి తెలియకుండా ఆమె చీరపై కాలు వేస్తాడు. ఆ తరువాత కాలు తీసి ఆ చీరని అందిస్తాడు. తర్వాత ఆమె అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇటీవల జరిగిన ఈవెంట్ లో కూడా ఇటువంటి ఘటనే చోటు చేసుకోవడంతో సోషల్ మీడియాలో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
Watch Video:
End of Article