సాధారణంగా మన ఆలోచనలలాంటివే ఇంకొకరికి వస్తూ ఉండటం చూస్తూనే ఉంటాం. దానికి కొంత మంది కాపీ అని పేరు పెడితే, కొంత మంది ఇన్స్పిరేషన్ అంటారు. ఇలాంటివి సినిమాల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఒక సినిమా కథని పోలిన కథతో మరొక సినిమా రావడం, కాస్ట్యూమ్స్ ఒకేలా ఉండడం, ఇలాంటివన్నీ అవుతూనే ఉంటాయి. అలా మన ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల కథలు ఒకదానిని పోలి మరొకటి ఉంటాయి. కానీ తెరపై చూపించే విధానం మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది.
Video Advertisement
ఈ విధంగా ఒకే కథ మీద వచ్చే హిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమా, నందమూరి బాలకృష్ణ సినిమా కూడా ఉంది. అక్కినేని నాగేశ్వరరావు గారు హీరోగా నటించిన ప్రేమాభిషేకం సినిమా మన అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సినిమాలో జయసుధ గారు, శ్రీదేవి గారు హీరోయిన్లుగా నటించారు. 1981 ఫిబ్రవరి 18వ తేదీన విడుదలైన ప్రేమాభిషేకం సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో హీరోకి క్యాన్సర్ అని తెలుస్తుంది. దాంతో అది దాచిపెట్టి హీరోయిన్ కి వేరొకరిని పెళ్లి చేసుకుని ఎలా చేస్తారు.
ఇదే కథతో బాలకృష్ణ కూడా మరొక సినిమా తీశారు. కోదండరామి రెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన బొబ్బిలి సింహం కూడా కథ కొంచెం ఇలాగే ఉంటుంది. కానీ అక్కడ హీరో స్థానంలో హీరోయిన్ కి క్యాన్సర్ ఉన్నట్టు చూపిస్తారు. ఈ కథని రచయిత విజయేంద్రప్రసాద్ రాశారు. ఇందులో మీనా, రోజా హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. అలా ఒకే కథతో వచ్చిన ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ సినిమాలుగా నిలిచాయి.