“మీకు అసూయ కలిగించేది ఏంటి..?” అనే ప్రశ్నకి… ఈ మహిళ రాసిన సమాధానం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

“మీకు అసూయ కలిగించేది ఏంటి..?” అనే ప్రశ్నకి… ఈ మహిళ రాసిన సమాధానం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

by Harika

Ads

ఎవరైనా ఒక మనిషికి, పక్కనే ఉన్న మనిషి, తన కంటే ముందు ఉన్నప్పుడు, వారికి చూసి అసూయ కలుగుతుంది. అసూయ అనేది అందరికీ వస్తుంది. కానీ కొంత మంది దాన్ని అంత ఆలోచించే విషయంగా తీసుకోరు. దాని కంట్రోల్ చేయాలి అని చూస్తారు. అలాంటి వాటిని పెద్దగా పట్టించుకోరు. అవతల వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించకూడదు అని అనుకుంటారు. అందుకే ఎప్పుడైనా అసూయ కలిగినా కూడా వెంటనే అలాంటి ఆలోచన నుండి బయటికి రావడానికి ప్రయత్నిస్తారు. ఇదే విషయం మీద కోరాలో చర్చ జరిగింది. అందులో ఒక వ్యక్తి, “మీకు అసూయ కలిగించేది ఏంటి?” అని అడిగారు.

Video Advertisement

a woman faces problem because of her boyfriend

అందుకు హరిత గారు ఒక సమాధానం చెప్పారు. కానీ హరిత గారు చెప్పిన సమాధానం చూస్తే, ఆలోచించాల్సిన విషయం లాగానే అనిపిస్తుంది. ఇలా చాలా మంది అనుకుంటారు. ప్రపంచంలో ఎంతో మందికి ఈ విధంగా అయితే అసూయ కలుగుతుంది. హరిత గారు ఈ విషయంపై మాట్లాడుతూ, “మొట్టమొదటగా నేను ఎక్కువ అసూయ పడేది…ఇదిగో ఇలా పొడుగాటి జడతో ఎవరు కనిపించినా కళ్ళు ఇంక ఆ జడను దాటిపోవు..ఇంతింత కళ్ళు చేసుకుని ఆ జడను …ఆ జడ యజమానురాలిని చూసి ఆ తర్వాత ఎలుక తోకకు కోతి తోకకు మధ్యలో ఉన్న నా జడ వైపు కోపం,జాలి కలిగిన బాధ తో ఓ చూపు చూసి చీ….అనుకుంటాను!!!”

ఏదో చదివేసి సాధించేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు.ఇలా పేరు వెనక ఐఏఎస్ అన్న హోదా పొండలేకపోయనే అని ఒక బాధ.

ఇలా అందమైన అమ్మాయినీ చూసినప్పుడు.. నేనూ ఇంకాస్త అందంగా ఉంటే బాగుండేది కదా అని ఒక అసూయ!!

మధ్యలో వదిలేసిన కూచిపూడి నాట్యం…ఎవరైనా చేస్తుంటే ..అదొక రకమైన అసూయ,బాధ అన్నీ కలిసి తన్నుకు వచ్చేస్తాయి.

నన్ను ఎక్కువ అసూయ పడేలా చేసే విషయాలు ఇవే.. ఎప్పుడు ఇవి నా కంట పడినా ఏం దేవుడా…నాకెందుకు ఇవి ఇవ్వాలని అనిపించలేదు నీకు అని అడగాలని అనిపిస్తుంది.కానీ అడగను.అడిగితే ఉన్నవి కూడా పోతాయేమో అన్న భయం!!.” అని రాశారు. నిజంగానే హరిత గారు చెప్పినట్టు చాలామంది జీవితంలో ఏవేవో చేద్దాం అని అనుకుంటారు. కానీ ఎన్నో కారణాల వల్ల అవన్నీ చేయలేక పోతారు. అలాంటి సమయంలో ఏదైనా సాధించిన వారిని చూస్తే, తాము అలా ఎందుకు సాధించలేదు అని ప్రశ్న అయితే మెదులుతుంది. అలా అని వారి మీద కోపంగా ఏం ఉండదు. అవతల వాళ్ళు సాధించినందుకు వాళ్ల గురించి మనం సంతోషపడతాం. కానీ మనం అలా ఎందుకు చేయలేకపోయాం అని ఆలోచన అయితే చేస్తాం.


End of Article

You may also like