అందాల తార అనుపమ పరమేశ్వరన్ కేవలం తెలుగు సినిమాల్లోనే కాదు తమిళ్, మలయాళ భాషల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. అయితే ఈమె కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేశారట. దుల్కర్ సల్మాన్ నిర్మాతగా మలయాళం లో తెరకెక్కిన ఓ చిత్రానికి అనుపమ పరమేశ్వరన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారట.

Video Advertisement

అలానే నటి గా కూడా ఈమె కి మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటికి ఈమె చాలా సినిమాలు చేసి ప్రేక్షకులని ఫిదా చేసేసారు.

anupama reaction about dj tillu sequel..

ఈమె నటన తో, అందం తో కూడా అందరినీ అకట్టేసుకుంటారు. ప్రస్తుతం అందాల తార అనుపమ పరమేశ్వరన్ వరుస విజయాలతో దూసుకు వెళ్లిపోతున్నారు. ఇక ఈమె 2022లో అందుకున్న హిట్స్ గురించి చూస్తే… అనుపమా 2022లో నటించిన మూవీస్ హిట్ అయ్యాయి. ఈమె రౌడీ బాయ్స్ సినిమా చేసారు అది కూడా అందరికీ నచ్చింది. బోల్డ్ రోల్‌ చేసి ఈమె ఆకట్టుకున్నారు. అలానే కార్తికేయ 2 సినిమా లో నిఖిల్ సరసన నటించారు. దానితో పాన్‌ ఇండియా రేంజ్‌ లో పాపులారిటీ వచ్చేసింది. అలానే ఈ మధ్యనే విడుదల అయిన 18పేజెస్‌ చిత్రం కూడా ఆడియెన్స్ ని నచ్చింది.

ఈ మూవీ దాదాపు రూ.25 కోట్ల గ్రాస్‌ కలెక్ట్ చేసింది. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే ఈ మూవీ లో ఈమెకే మంచి పేరు వచ్చింది. నిఖిల్ కంటే ఈమెకే ఎక్కువ పేరు రావడం విశేషం. బట్టర్‌ ఫ్లై సినిమా కూడా చేసింది అనుపమ. ఈ సినిమా కి కూడా మంచి పేరే వచ్చింది. ముఖ్యంగా ఆమె నటన ని అంతా అభినందిస్తున్నారు. ఓటీటీ లో ఈ మూవీ విడుదల అయ్యింది. ఇలా అనుపమా తన క్రేజ్ ని పెంచుకుంటూనే వుంది. దీనితో ఈమె రెమ్యునరేషన్ ని పెంచబోతోందట. ఒక్కో సినిమాకి యాభై లక్షల వరకు ఈమె తీసుకునేది. కానీ ఇక మీదట 1.20 కోట్ల వరకు డిమాండ్‌ చేస్తుందని టాక్.