కొన్ని సినిమాలు విడుదల అయినప్పుడు హిట్ అవ్వవు. తర్వాత టీవీలో చూసినప్పుడు అందరికీ చాలా నచ్చుతాయి. “అరే! అసలు ఈ సినిమా ఎలా ఫ్లాప్ అయింది. అసలు ఎవరికి టేస్ట్ లేదు” అని అనుకుంటాం. ఇదే మాటని సోషల్ మీడియాలో ఆ సినిమాకి సంబంధించిన పోస్ట్ కింద కామెంట్స్ లో, అలాగే యూట్యూబ్ లో ఆ సినిమాకి సంబంధించిన వీడియోస్ కింద కామెంట్స్ లో పెడుతూ ఉంటాం.

 

ఇప్పుడు ఇదంతా చదవంగానే మీలో చాలా మందికి కొన్ని సినిమాలు స్ట్రైక్ అయ్యే ఉంటాయి. వాటిలో కచ్చితంగా ఉండే సినిమా ఖలేజా. సినిమా విడుదలై 10 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ ఖలేజా గురించి అందరూ మాట్లాడుకుంటారు.

ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ లో అనుష్క కి, మహేష్ బాబు కి మధ్య వచ్చే సీన్స్ ఒకటి. అయితే ఖలేజా సినిమా కి హీరోయిన్ గా మొదటి ఛాయిస్ అనుష్క కాదట. ఈ సినిమాకి మొదట హీరోయిన్ గా పార్వతి మెల్టన్ ని అనుకున్నారట.

కానీ అరుంధతి సినిమాలో తన పర్ఫామెన్స్ తో మంచి క్రేజ్ సంపాదించుకున్న అనుష్క అయితే సినిమాకి సరిపోతారు అని అనుష్క ని హీరోయిన్ గా సెలెక్ట్ చేసారట త్రివిక్రమ్.  అలా ఈ సినిమాలో అనుష్క హీరోయిన్ గా చేశారు. పార్వతి మెల్టన్ అంతకు ముందు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో జల్సా సినిమాలో నటించారు. అలాగే మహేష్ బాబుతో దూకుడు సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించారు.