Ads
అనుష్క బాహుబలి తర్వాత అంత యాక్టివ్ గా లేదు. బాహుబలి 2 తర్వాత అనుష్క పూర్తి స్థాయిలో నటించిన చిత్రాలు రెండు మాత్రమే. అవి భాగమతి ఒకటి కాగా.. మరొకటి నిశ్శబ్దం. నిశ్శబ్దం చిత్రం అనుష్క అభిమానులని తీవ్రంగా నిరాశపరిచింది. ఆ తర్వాత కూడా అనుష్క సినిమాల గురించి ఎలాంటి న్యూస్ రాకపోవడంతో ఫ్యాన్స్ లో అనుమానాలు పెరిగాయి. బరువు కూడా పెరుగుతుండడంతో అనుష్క ఇక సినిమాలకు దూరం అవుతోందనిచాలా రూమర్స్ వినిపించాయి.
Video Advertisement
అయితే యువి క్రియేషన్స్ బ్యానర్ లో పి మహేష్ దర్శకత్వంలో అనుష్క నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోగా జాతిరత్నాలు హీరో నవీన్ పోలిశెట్టి నటిస్తున్నారు.
అనుష్క ఈ చిత్రంలో అంతర్జాతీయంగా ఫేమస్ అయిన చెఫ్ పాత్రలో నటించబోతోంది. నవీన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా కనిపించనున్నటట్లు సమాచారం. ఒక 40 ఏళ్ల మహిళ ఆమె తన వయస్సులో సగం వయస్సు ఉన్న వ్యక్తితో ప్రేమలో పడుతుంది అన్నది కథ అని సమాచారం.
అయితే తాజాగా ఈ సినిమా టీమ్ తెగ టెన్షన్ పడుతోందనే టాక్ బలంగా వినిపిస్తోంది. వారి కంగారుకు కారణం ‘స్వాతిముత్యం’, ‘అశోక వనం లో అర్జున కళ్యాణం’ సినిమా లు అని తెలుస్తోంది.
‘స్వాతిముత్యం’ కథ అంతా కూడా వీర్యదానం – సరోగసి అనే పాయింట్ చుట్టూ కామెడీని టచ్ చేస్తూ నడుస్తుంది. కామెడీని పక్కన పెడితే, అనుష్క సినిమా కథాంశం కూడా ఇదేనని అంటున్నారు. అలాగే అర్జున కళ్యాణం కథ కూడా కొంచెం టచ్ అయ్యేలా ఉంటుందని .. దీంతో ఆ మాట రాకుండా ఈ సినిమా టీమ్ జాగ్రత్తలు తీసుకుంటోందని చెబుతున్నారు. కథలో కొన్ని మార్పులు చేస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
End of Article