అనుష్క…పెద్దగా పరిచయం అవసరం లేని పేరు . సూపర్ సినిమా తో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ కి అడుగు పెట్టి వరుస విజయాలతో దూసుకుపోతోంది. అరుంధతి ,భాగమతి,పంచాక్షరీ లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది . బాహుబలి లాంటి భారీ బడ్జెట్ సినిమా లో నటించి తన నటన తో అందరిని మెప్పించి టాప్ ప్లేస్ లో నిలిచింది .
anushka
అనుష్క సినిమా ల్లోకి వచ్చిన కొత్త లో 10 లక్షల పారితోషకం తీసుకునేవారు. తర్వాత క్రమంగా తన కి టాలీవుడ్ లో మార్కెట్ పెరగడం తో 5 కోట్ల నుండి 10 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే అప్పట్లో మహానటి సినిమా లో అనుష్క నటించాల్సి ఉంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి . నాగ్ అశ్విన్ డైరెక్టన్ లో వచ్చిన మహానటి సినిమా ఎంతటి ఘనా విజయాన్ని సాధించిందో మనందరికీ తెలుసు . నాగ్ అశ్విన్ మొదట సావిత్రి పాత్ర కోసం అనుష్కను అడగ్గా అప్పటికే భాగమతి తో బిజీ గా ఉన్న అనుష్కకి డేట్లు కుదర్లేదు. దాంతో ఆ అవకాశం కాస్త కీర్తి సురేష్ ని వరించింది. ఈ సినిమా కీర్తి కెరీర్ లో ఒక మైలు రాయి గా నిలిచిపోయింది. తన నటనతో హావ భావాలతో అందరిని మెప్పించి సావిత్రమ్మ ను గుర్తు చేసారు.

Video Advertisement