తెలుగు సినిమా ఇండస్ట్రీలో గేమ్ ఛేంజింగ్ సినిమా అంటే మొట్టమొదటిగా గుర్తొచ్చే సినిమా అర్జున్ రెడ్డి. 2017 లో విడుదలైన ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలుసు. ఈ సినిమా విజయ్ దేవరకొండ క్రేజ్ ని పెంచేసింది. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ భారతదేశం అంతటా చాలా పాపులర్ అయ్యారు. ఈ సినిమాకి విజయ్ దేవరకొండ ఎన్నో అవార్డులను కూడా గెలుచుకున్నారు.Senior actress Kanchana special song

ఇదే సినిమాతో సందీప్ రెడ్డి వంగా దర్శకుడిగా, షాలిని పాండే హీరోయిన్ గా పరిచయం అయ్యారు. ఇదే సినిమాని హిందీలో కబీర్ సింగ్ పేరుతో తెరకెక్కించారు. ఈ సినిమాకి కూడా సందీప్ రెడ్డి దర్శకత్వం వహించారు. అర్జున్ రెడ్డి సినిమాలో మరో ముఖ్య పాత్రలో నటించారు సీనియర్ నటి కాంచన గారు. కాంచన గారు అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ నాయనమ్మగా నటించారు.Senior actress Kanchana special song

కాంచన గారు అంతకుముందు ఉన్న ఎంతో మంది అగ్ర హీరోలతో కూడా నటించారు. ఆ టైంలో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు. తర్వాత సినిమాలకు దూరం అయ్యారు. అయితే, అర్జున్ రెడ్డి సినిమా దర్శకుడు అయిన సందీప్ రెడ్డి వంగా, అలాగే సినిమా బృందం వెళ్ళి కాంచన గారితో మాట్లాడి, ఒప్పించి, ఈ సినిమాలో నటించేలా చేశారట.Senior actress Kanchana special song

అయితే, కాంచన గారు అంతకుముందు ఎంతో ఫేమస్ అయిన ఒక పాటలో నటించారు. ఆ పాటని మనం ఇప్పటికి కూడా వెంటనే ఉంటాం. 1973 లో విడుదలైన దేవుడు చేసిన మనుషులు సినిమాలోని మసక మసక చీకటిలో పాట మన అందరికీ తెలుసు. ఈ  పాటలో నటించింది మరెవరో కాదు. కాంచన గారే. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా ఇలాంటి డాన్స్ నెంబర్ లో కూడా నటించి ఎంతో పేరు తెచ్చుకున్నారు.

watch video: