Ads
తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రజాధారణ పొందిన ప్రోగ్రాం ఏది అంటే ఇట్టే చెప్పేస్తారు ‘జబర్దస్త్’ అని ఎవరైనా. ప్రతి గురు, శుక్రవారాల్లో ప్రతి ఇంట్లో టీవీలకు అతుక్కుపోతూ ఉంటారు.”జబర్దస్త్” కామెడీ షో ఎంతో మంది ఆర్టిస్ట్ లకు లైఫ్ ఇచ్చింది. జబర్దస్త్ స్టేజి పై పెర్ఫార్మ్ చేసి పేరు తెచ్చుకున్న వాళ్లలో అప్పారావు ఒకరు. అయితే గత కొంతకాలంగా అప్పారావు జబర్దస్త్ స్టేజిపై కనిపించడం లేదన్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ఆయనను ఇంటర్వ్యూ లో ప్రశ్నించగా అసలు కారణం ఏంటో చెప్పారు.
Video Advertisement
గత ఏడెనిమిది సంవత్సరాలుగా తాను జబర్దస్త్ షో లో పని చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే… ఒక్కరోజు కూడా స్కిప్ చేయకుండా వెళ్ళేవాడినని గుర్తు చేసుకున్నారు. అయితే.. కోవిడ్ సమయంలోనే గ్యాప్ వచ్చిందన్నారు.
ఆ సమయంలో నా వయసుని దృష్టిలో ఉంచుకుని కొన్ని రోజులు ఆగమని మానేజ్మెంట్ చెప్పడం వలనే కొన్ని రోజులు ఆగానని చెప్పుకొచ్చారు. అయితే.. ఆ తరువాత వాళ్ళు మళ్ళీ పిలవలేదన్నారు. చెప్పుడు మాటలు వినడం వల్లే వాళ్ళు నన్ను హోల్డ్ లో పెట్టారు అని అప్పారావు చెప్పుకొచ్చారు. స్టేజి పై చాలా పాత్రలు చేసానని.. నా పాత్రకి అంతగా ప్రాధాన్యత లేకపోయినా చేసానని చెప్పుకొచ్చారు.
కానీ, నాకు తగిన గుర్తింపు ఇవ్వలేదన్నారు. షోలో సీనియర్ ని అయినప్పటికీ.. ఇతర కంటెస్టెంట్ లకి ఇచ్చిన గుర్తింపు కూడా ఇవ్వలేదని బాధపడ్డారు. పరోక్షంగా అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. అందుకే జబర్దస్త్ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందన్నారు.ఆ షో నుంచి తప్పుకున్నా.. కనీసం ఎందుకు వెళ్ళిపోతున్నావ్ అని కూడా అడగలేదని చెప్పుకొచ్చారు. ఏదైతే అది అయింది.. ప్రస్తుతం మరో కామెడీ షోలో చేస్తున్నానని.. డబుల్ పేమెంట్ ఇస్తున్నారని.. ఇప్పుడు నా పరిస్థితి బాగుందని అప్పారావు చెప్పుకొచ్చారు.
End of Article