చాలా రోజుల ఎదురుచూపు తర్వాత మళ్లీ బిగ్ బాస్ తెలుగు సీజన్-6 మొదలయ్యింది. ఈ సారి చాలా మందికి తెలిసిన కంటెస్టెంట్స్ ఉన్నారు. జబర్దస్త్ లో వచ్చే చలాకి చంటి కూడా ఈ షోలో పాల్గొన్నారు. అలాగే కొంత మంది సీరియల్ నటులు కూడా ఈ సారి ఉన్నారు. ప్రముఖ నటి అభినయ శ్రీ కూడా ఈసారి కంటెస్టెంట్ గా పాల్గొన్నారు.

Video Advertisement

వీరు మాత్రమే కాకుండా కామన్ మాన్ ఆది రెడ్డి, అలాగే మరికొంత మంది యూట్యూబ్ లో ఫేమస్ అయిన నటులు కూడా ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ గా ఉన్నారు. ఈ సారి బిగ్ బాస్ హౌస్ కూడా చాలా కొత్తగా ఉంది. కానీ అందులో ఉన్న కొన్ని పద్ధతులు మాత్రం ప్రేక్షకులకు అంత బాగా నచ్చలేదు.

audience comments on bigg boss telugu 6 house and facilities

ఈసారి ఏకంగా 21 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అంత మంది ఉన్నారు అంటే, అంతమందికి తగ్గట్టు ఇల్లు కూడా ఉండాలి. కానీ ఈ సారి అలా లేదు. బెడ్ రూమ్ చాలా చిన్నగా ఉంది. అందులో బెడ్స్ కూడా తక్కువగానే ఉన్నాయి. ఇల్లు చూస్తే ఏమో చాలా విశాలంగా ఉంది. కానీ ఇలాంటి కనీస సౌకర్యాలు కూడా సరిగ్గా లేవు. ఉన్నవారికి బెడ్ సరిపోకపోవడంతో కొంత మంది కంటెస్టెంట్స్ నేలపై పడుకున్నారు. అభినయ శ్రీ అయితే చోటు లేకపోవడంతో బయటికి వెళ్ళి కూర్చున్నారు. ఇలాంటి పరిస్థితి అంతకుముందు సీజన్స్ లో రాలేదు. ఇలా మొదటి సారి జరిగింది.

audience comments on bigg boss telugu 6 house and facilities

దాంతో చాలా మంది, “ఈ బిగ్ బాస్ హౌస్ కంటే హాస్టల్ నయం ఏమో” అని అంటున్నారు. బెడ్ రూమ్ లో మొత్తం ఎనిమిది బెడ్స్ ఉన్నాయి. వారిలో ఒక జంట ఉన్నారు కాబట్టి వారికి ఒక బెడ్ ఇచ్చేశారు. కానీ మిగిలిన వాళ్ళు అందరూ కూడా అడ్జస్ట్ చేసుకోవడం కొంచెం కష్టం గానే ఉంది. “అసలు ఆలోచించకుండా ఇలాంటి పని ఎలా చేశారు?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. “షో అంటే టాస్క్ ఉండడం సహజమే. కానీ ఇలాంటి సౌకర్యాలు కూడా ఉండాలి” కదా అని అంటున్నారు.