Ads
ఒక భాషలో ఒక సినిమా తీస్తే, అది హిట్ అయితే, వేరే భాషల్లోకి కూడా ఆ సినిమాని తీసుకెళ్తారు. దీనికి రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి డబ్ చేయడం. ఇంకొకటి రీమేక్ చేయడం. రెండిట్లో ఏది చేసినా కూడా ఒరిజినల్ సినిమాని ప్రాపర్ గా కన్వే చేయకపోతే, రిజల్ట్ మారిపోతుంది. కొన్ని సినిమాలు మాత్రం ఒరిజినల్ కంటే రీమేక్ బాగుంది అనుకునేలా ఉంటాయి.
Video Advertisement
కొన్ని మాత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వవు. ఒక వేళ మంచి ఫలితం వచ్చినా కూడా, ఒరిజినల్ సినిమా కంటే మన నేటివిటీకి తగ్గట్టు చాలా మార్పులు చేస్తారు. అలా మన తెలుగు హీరోలు కూడా కొన్ని వేరే భాష సినిమాలని రీమేక్ చేశారు. మన తెలుగు సినిమాలను కూడా వేరే భాష వాళ్ళు రీమేక్ చేశారు. హిట్ అయిన సినిమాలను రీమేక్ చేస్తే అది సహజం ఏమో అనుకోవచ్చు. కానీ తెలుగులో అంత మంచి స్పందన రాని కొన్ని సినిమాలను కూడా హిందీలో రీమేక్ చేశారు.
ఇటీవల హిందీలో విడుదలైన ఒక సినిమా కూడా మన తెలుగు నుండి రీమేక్ చేసిన సినిమా. ఆ సినిమా పేరు నికమ్మా. ఈ సినిమా మన తెలుగు సినిమా రీమేక్. తెలుగులో కూడా ఈ సినిమాకి అంత మంచి స్పందన రాలేదు. ఆ సినిమానే నాని హీరోగా నటించిన ఎంసీఏ. ఈ సినిమాకి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించారు. భూమిక ఒక ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమా ఒక కమర్షియల్ సినిమా అవ్వడంతో విడుదల అయిన తర్వాత స్టోరీలో పెద్ద కొత్తదనం లేదు అని అన్నారు. కలెక్షన్స్ బాగా వచ్చినా కూడా సాధారణ కమర్షియల్ సినిమాల లాగానే ఈ సినిమా కూడా ఉంది అని అన్నారు.
ఈ సినిమా విడుదల అయిన ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ సినిమా హిందీ రీమేక్ ఇటీవల విడుదల అయ్యింది. ఇందులో అభిమన్యు దాసాని హీరోగా నటించారు. షిర్లీ సెటియా హీరోయిన్ గా నటించారు. భూమిక పాత్రలో శిల్పా శెట్టి నటించారు. ఈ సినిమాపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తెలుగులో ఈ సినిమా హిట్ అవ్వడానికి ముఖ్య కారణం హీరోగా నటించిన నాని నటన. కానీ హిందీలో మాత్రం “సినిమా చాలా బోరింగ్ గా ఉంది” అంటూ, అలాగే “కొన్ని సీన్స్ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాయి” అని అంటున్నారు. అంతేకాకుండా చాలా మంది “అసలు ఈ సినిమా హిందీలో రీమేక్ చేయాల్సిన అవసరం ఏంటి?” అని కామెంట్స్ చేస్తున్నారు.
End of Article