బాహుబలి సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి ఆరేళ్ళు కావొస్తున్నా.. ఇంకా మైండ్ లోంచి పోలేదు. ఆ గ్రాఫిక్స్ కానీ, విజువల్స్ కానీ అంత అందం గా డిజైన్ చేసారు.
అందుకే బాహుబలి సినిమా ఓ విజువల్ వండర్. జక్కన్న చెక్కిన ఈ సినిమా శిల్పం తెలుగు సినిమా గౌరవాన్ని మరింత పెంచింది.
అయితే.. ఈ సినిమాలో కూడా కొన్ని సీన్లు కాపీ వే ఉన్నాయి అంటూ చాలా వీడియోస్ వచ్చాయి. ఈ సినిమా స్టోరీ గురించి కానీ, కొన్ని సీన్ల గురించి కానీ ఎక్కడెక్కడ నుంచి కాపీ కొట్టారో చెప్పుకొచ్చారు. అసలు వీళ్ళు ఇవన్నీ ఎలా కనిపెడతారో కూడా తెలియదు. మనం చూసిన తరువాత “ఏంటి ఇది కాపీ నా”? అని అనుకుంటూ ఉంటాం.
రీసెంట్ గా, గులాబీ ఛానెల్ వారు కూడా కొన్ని ఒరిజినల్ సీన్స్ ను కంపేర్ చేస్తూ ఓ ట్రోలింగ్ వీడియో ను పోస్ట్ చేసారు. ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. తమన్నా ఎంట్రీ, ప్రభాస్ ఎంట్రీ సీన్ లను కూడా కాపీ చేశారని అర్ధం అయిపోతుంది. కట్టప్ప ని ప్రభాస్ “నేనెవర్ని” అని అడుగుతాడు కదా.. ఆ సీన్ కూడా కాపీ చేసిన సీనే. ఏ సీన్ ని ఎక్కడనుంచి కాపీ చేసారో మీరు ఈ కింద వీడియో చూడొచ్చు.
Watch Video:
https://youtu.be/lg-9D6BsHoU