ప్రస్తుతం ఎస్ ఎస్ తమన్ హవా మాములుగా లేదు. వరసగా టాప్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. తమన్ సంగీతం అందించిన సినిమాలు దాదాపుగా అన్నీ సూపర్ డూపర్ హిట్స్ అవుతున్నాయి.
టాలీవుడ్ లో వరసగా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, చిరంజీవి, బాలకృష్ణ వంటి హీరోలతో సినిమాలు చేస్తున్నారు తమన్. ఇలా టాప్ సినిమాలతో పాటు మీడియం, స్మాల్ బడ్జెట్ చిత్రాలకు కూడా పనిచేస్తున్నారు ఈ టాప్ సంగీత దర్శకుడు.
ఇటీవల ఆయన అఖండ కి ఇచ్చిన మ్యూజిక్ తో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. తాజాగా.. తమన్ అలీతో సరదాగా షో లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చాలా విషయాలను పంచుకున్నారు. తన తొలి రికార్డింగ్ అనుభవం గురించి కూడా తమన్ పంచుకున్నారు. తమన్ తన తొలి రికార్డింగ్ ను భైరవ ద్వీపం మూవీ కి చేశారట. అందుకు గాను, ఆయనకు ముప్పై రూపాయల జీతాన్ని ఇచ్చారట.







































