వెండితెర వెలుగు జిలుగులప్రపంచం వెనకాల వెలుగు చూడని మిస్టరీలు ఎన్నో..వడ్డించని జీవితంలోపల బయటి ప్రపంచానికి కనపడని విషాదాలెన్నో..సిని గ్లామర్ ప్రపంచంలో విషాదాంతం అయిన జీవితాలెన్నో అలాంటి వాటిల్లో ఉదయ్ కిరణ్ ది అందరిని కదిలించిన విషాదం..చిత్రం సినిమాతో టాలివుడ్ కి పరిచయం అయిన ఉదయ్ కిరణ్ చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంగతి తెలిసిందే.
తేజ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన సినిమా “నువ్వు నేను”. ఈ సినిమా 2001 లో విడుదల అయ్యింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఎన్నో అవార్డులను కూడా గెలుచుకుంది.
తేజకు ఉత్తమ దర్శకుడిగా ఈ సినిమా వలనే అవార్డు లభించింది. ఇక సంగీత దర్శకుడు, ఉత్తమ హాస్య నటుడు, ఉత్తమ సహాయ నటుడు, ఛాయా గ్రాహకుడు.. ఇలా నాలుగు విభాగాలతో కలుపుకుని మొత్తం ఐదు నంది అవార్డులను ఈ సినిమా సొంతం చేసుకుంది. తేజ ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ అయిపోయారు. అయితే.. ఈ సినిమా గురించి ఓ దురదృష్టకర విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ఈ సినిమాలో నటించిన చాలా మంది నటులు ప్రస్తుతం భౌతికంగా మన మధ్య లేరు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకుని చనిపోగా.. ఆహుతి ప్రసాద్ అనారోగ్యంతో మరణించారు. ధర్మ వరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, కూడా కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం వీరు కూడా మన మధ్య లేరు. హీరో తండ్రిగా నటించిన వైజాగ్ ప్రసాద్ కూడా మరణించారు. ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించిన వారంతా దూరం అయ్యారు.
అలాగే ఉదయ్ కిరణ్ తో “కలుసుకోవాలని” సినిమాలో నటించిన “ప్రత్యూష” కూడా మన మధ్య లేరు. “నీ స్నేహం” సినిమాలో ఉదయ్ కిరణ్ తో జతకట్టిన “ఆర్తి అగర్వాల్” మనకి దూరమయ్యారు. అంతేకాదు ఆ సినిమాలో “ఆర్తి అగర్వాల్” కి తల్లితండ్రుల పాత్ర పోషించిన “కె.విశ్వనాద్” గారు, “సుజాత” గారు కూడా మానమధ్యన లేకపోవడం మన దురదృష్టం.