Home serials “ఇంటింటి గృహలక్ష్మి” సీరియల్ లో తులసి కూతురిగా వచ్చిన “దివ్య” ఎవరో తెలుసా..? ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

“ఇంటింటి గృహలక్ష్మి” సీరియల్ లో తులసి కూతురిగా వచ్చిన “దివ్య” ఎవరో తెలుసా..? ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

by Anudeep

స్టార్ మాలో ప్రసారం అవుతోన్న ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది.ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. అయితే తాజాగా ఈ సీరియల్ లో దివ్య పాత్రలో ఒక కొత్త నటిని తీసుకొచ్చారు. చాలా సీరియల్స్ లో ఉన్నట్టే ఈమె కూడా కన్నడ నుంచి వచ్చిన నటి.

ఈ సీరియల్‌లో మొన్నటి వరకూ తులసి కూతురుగా దివ్య అనే అల్లరిపిల్ల ఉండేది. ఆ పిల్ల పేరు పూజిత రెడ్డి. ఆమెను చదువు పేరుతో యూఎస్ పంపించి.. సీరియల్ నుంచి పీకేసి.. ఇప్పుడు ఆమె ప్లేస్‌లో దివ్యగా కన్నడ భామ ఇంచర శెట్టిని తీసుకుని వచ్చారు. కన్నడలో అనేక సీరియల్స్‌లో నటించిన ఇంచర ‘రాధిక’ సీరియల్‌తో పాపులర్ అయ్యింది. ఈ సీరియల్‌లో గమ్య పాత్రలో మెప్పించింది. ఆ తరువాత ‘కెండ సంపిగే’ అనే సీరియల్‌లోనూ కీలకపాత్ర పోషించింది.

who is the new actor in gruha lakshmi serial..

తాజాగా ఇంచర తెలుగులో ‘ఇంటింటి గృహలక్ష్మి’తో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో తులసి కూతురు దివ్య పాత్రలో మెప్పించే ప్రయత్నం చేస్తుంది. తాజా ప్రోమో లో ఆమె తనని తాను పరిచయం చేసుకుంటూ.. “అందరికీ నమస్కారం.. నేను మీ దివ్య.. నేను ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ద్వారా మీ ముందుకు వస్తున్నాను. మీరు మా అమ్మని ఆదరించినట్టే నన్ను కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అమ్మతో నా ప్రయాణం చూడాలంటే.. గృహలక్ష్మి చూడండి” అని ఇంచర లుగు ప్రేక్షకులకు పరిచయం చేసుకుంది.

who is the new actor in gruha lakshmi serial..

ఒకప్పుడు కార్తీకదీపం సీరియల్‌కి గట్టి పోటీగా నిలిచిన ఈ సీరియల్‌ తాజాగా టీఆర్పీ రేటింగ్‌లో మూడో స్థానానికి పడిపోయింది. ఈ సీరియల్ లో లీడ్ రోల్ అయిన తులసి మైనస్ గా మారింది. దీంతో దివ్యతో కథని నడిపించేందుకు మార్పులు చేర్పులు చేశారు. కానీ మేకర్స్ ఎమోషన్స్ పండించడంలో కానీ.. కథనాన్ని ఆసక్తికరంగా మలచడంపై కానీ ఫోకస్ పెట్టడం లేదు. దాని ప్రభావమే రేటింగ్‌పై పడింది. మరి దివ్య రాకతో అయితే గృహలక్ష్మి గాడిలో పడుతుందేమో చూడాలి.

You may also like