ఒకప్పుడు సినిమాల్లో నటించి…ఇప్పుడు సీరియల్స్‌లో నటిస్తున్న ఈ 3 సీనియర్ ఆర్టిస్ట్ ల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

ఒకప్పుడు సినిమాల్లో నటించి…ఇప్పుడు సీరియల్స్‌లో నటిస్తున్న ఈ 3 సీనియర్ ఆర్టిస్ట్ ల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

by Mohana Priya

Ads

ఒకప్పుడు సినిమాల్లో నటించిన చాలా మంది ఇప్పుడు సీరియల్స్ లో నటిస్తున్నారు. వీళ్లలో చాలా మంది తెలుగు సినీ నటీనటులు కూడా ఉన్నారు. అందులో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. ఒక సమయంలో ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన హీరోయిన్స్, ఇప్పుడు సీరియల్స్ లో నటిస్తున్నారు. చాలా గుర్తింపు సంపాదించుకుంటున్నారు. సినిమాల ద్వారా ఎంత మంది అభిమానులని అయితే సంపాదించుకున్నారో, ఇప్పుడు సీరియల్స్ ద్వారా కూడా అంతకంటే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. సీనియర్స్ అయినా కూడా వీళ్ళకి ఇప్పటికి కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. అలా సీరియల్స్ లో, హీరోయిన్ పాత్రల్లో, లేదా ముఖ్య పాత్రల్లో నటిస్తున్న కొంత మంది హీరోయిన్స్ చాలా ఎక్కువ పారితోషకం అందుకుంటున్నారు. వాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

#1 సుజిత

ఎన్నో సినిమాల ద్వారా, సీరియల్స్ ద్వారా ఫేమస్ అయ్యారు సుజిత. సుజిత గత కొన్ని సంవత్సరాల నుండి సీరియల్స్ చేస్తున్నారు. అయితే ఎపిసోడ్ కి 25 వేల పైన రెమ్యూనరేషన్ తీసుకుంటారు. సుజిత ప్రస్తుతం తెలుగులో జెమినీ టీవీలో ప్రసారం అవుతున్న గీతాంజలి సీరియల్ లో నటిస్తున్నారు.

senior heroines remuneration in serials

#2 కస్తూరి శంకర్

ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ద్వారా ఫేమస్ అయిన కస్తూరి శంకర్ రోజుకి 25 వేల పారితోషకం అందుకుంటున్నారు. ఒకవేళ వెబ్ సిరీస్, సినిమా షూటింగ్స్ అయితే 50 వేలకి పైగా పారితోషకం తీసుకుంటారు.

senior heroines remuneration in serials

#3 రాశి

ఇటీవల వచ్చిన జానకి కలగనలేదు సీరియల్ లో హీరో తల్లి జ్ఞానాంబ పాత్రలో రాశి నటించారు. ఈ సీరియల్ కోసం రాశి రోజుకి 25 వేల పైన రెమ్యూనరేషన్ తీసుకున్నారు.

senior heroines remuneration in serials

సీరియల్స్ లో హీరోయిన్స్ కి కూడా సినిమా హీరోయిన్స్ కి ఉన్నంత క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు సీనియర్ హీరోయిన్స్ అయినా కూడా, సీరియల్స్ లో వీళ్లలో చాలా మంది ఎక్కువగా హీరోయిన్ పాత్రలే పోషిస్తున్నారు. వీరి పాత్రల చుట్టూ సీరియల్ నడుస్తూ ఉంటుంది. వీరి పాత్రలకి సీరియల్ లో అంత ప్రాముఖ్యత ఉంటుంది. ఒక్క ఎపిసోడ్ లో వీళ్ళు కనిపించకపోయినా కూడా వీళ్ళ గురించి ప్రేక్షకులు దిగులు పడతారు. అందుకే వీళ్ళు కష్టపడి ప్రతి ఎపిసోడ్ లో కనిపించేలాగా పనిచేస్తూ ఉన్నారు. దానికి తగ్గ పారితోషకం కూడా అందుకుంటున్నారు.


End of Article

You may also like