రిషి సర్ ఫ్యాన్స్ మీద ఫైర్ అయిన మను..! “పర్సనల్ లైఫ్ లోకి వెళ్లి తిడతారా..?” అంటూ..?

రిషి సర్ ఫ్యాన్స్ మీద ఫైర్ అయిన మను..! “పర్సనల్ లైఫ్ లోకి వెళ్లి తిడతారా..?” అంటూ..?

by Mohana Priya

Ads

సీరియల్స్ అన్న తర్వాత ప్రేక్షకులకి వ్యక్తిగతంగా ఏదో అనుబంధం ఉంటుంది. రోజు వారిని టెలివిజన్ లో చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్లని తమ ఇంట్లో వారిలాగా అనుకుంటూ ఉంటారు. అలా, స్టార్ మా లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులకి చాలా బాగా నచ్చింది. ఆ సీరియల్ లో హీరోగా నటించే రిషి సర్ అలియాస్ ముఖేష్ గౌడ కొన్నాళ్లు సీరియల్ లో కనిపించకుండా వెళ్లిపోయారు. దాంతో, “రిషి సర్ సీరియల్ లో లేకపోతే సీరియల్ చూడం” అని కామెంట్స్ రావడం మొదలు అయ్యాయి. దాంతో ఇప్పుడు రిషి పాత్రని మళ్లీ సీరియల్ లోకి తీసుకొచ్చారు.

Video Advertisement

guppedantha manasu ravi shankar rathod on comments

అయితే, రిషి పాత్ర వెళ్ళిపోయాక మను అనే కొత్త పాత్రని పరిచయం చేశారు. రిషి పాత్రలోకి మను హీరోగా వచ్చాడు అంటూ అతని మీద కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. మను పాత్రలో నటించే యాక్టర్ పేరు రవిశంకర్ రాథోడ్. రవిశంకర్ మీద సోషల్ మీడియాలో కామెంట్స్ రావడం మొదలు అయ్యాయి. అవి ఎంత దూరం వెళ్లాయి అంటే, రవిశంకర్ వ్యక్తిగత జీవితం గురించి కూడా మాట్లాడడం మొదలుపెట్టారు. ఇదే విషయం మీద రవిశంకర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడి, తనకి వచ్చిన మెసేజెస్ చూపించారు. కొంత మంది పాజిటివ్ గానే కామెంట్స్ చేస్తారు అని చెప్పారు. కానీ కొంత మంది మాత్రం అనవసరంగా ఏమేమో కామెంట్స్ చేస్తారు అని అవి చూపించారు. సీరియల్ కి కొన్ని ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి.

వారిలో కొంత మంది రవిశంకర్ నటన బాగుంటుంది అని కామెంట్స్ చేస్తే, కొంత మంది మాత్రం, “నువ్వు వెళ్లి పళ్ళు పీక్కో” అని కామెంట్స్ చేశారు అని చూపించారు. తన హెయిర్ స్టైల్ బాలేదు, డ్రెస్సింగ్ స్టైల్ బాలేదు, లావయ్యారు, తన పాత్ర గురించి ఏదైనా కామెంట్స్ వస్తే తాను అంగీకరిస్తాను అని, ఇలా కావాలని రెచ్చగొట్టే కామెంట్స్ చేస్తే ఊరుకునేది లేదు అని రవిశంకర్ చెప్పారు. తాను డాక్టర్ అని, నటన మీద ఉన్న ఇష్టంతో తాను ఈ రంగంలోకి వచ్చాను అని, డబ్బుల కోసం రాలేదు అని చెప్పారు. పర్సనల్ లైఫ్ లోకి కూడా వెళ్లిపోయి కామెంట్స్ చేస్తారు అని చూపించారు.

watch video :


End of Article

You may also like