కంటతడి పెట్టిస్తున్న త్రినయని నటి పవిత్ర జయరాం భర్త పోస్ట్..! “ఒక్క సారి మామా అని పిలువే..!” అంటూ..?

కంటతడి పెట్టిస్తున్న త్రినయని నటి పవిత్ర జయరాం భర్త పోస్ట్..! “ఒక్క సారి మామా అని పిలువే..!” అంటూ..?

by Mohana Priya

Ads

త్రినయని అనే సీరియల్ ద్వారా పాపులర్ అయ్యారు నటి పవిత్ర జయరాం. ఈ సీరియల్ లో విలన్ పాత్రలో పవిత్ర నటిస్తున్నారు. పవిత్ర స్వతహాగా కన్నడ వారు. తెలుగు సీరియల్స్ లో అవకాశాలు రావడంతో ఇక్కడ కూడా సీరియల్స్ చేయడం మొదలుపెట్టారు. తెలుగులో నిన్నే పెళ్ళాడుతా అనే సీరియల్ లో మొదటిసారిగా పవిత్ర నటించారు. ఆ తర్వాత వరుస పెట్టి అవకాశాలు రావడం మొదలు అయ్యాయి. పవిత్ర కన్నడలో రోబో అనే సీరియల్ కూడా చేశారు. ఆ తర్వాత తెలుగులో సీరియల్స్ చేస్తూ వచ్చారు. త్రినయని అనే సీరియల్ ద్వారా పవిత్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ అయిపోయారు.

Video Advertisement

pavitra-jayaram husband emotional post

జీ తెలుగులో ప్రసారం అయ్యే త్రినయని సీరియల్ టాప్ టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతోంది. దాంతో సీరియల్ లో నటించిన వాళ్లందరికీ కూడా మంచి పేరు వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళని సీరియల్ లో నటించిన క్యారెక్టర్ పేర్లతోనే గుర్తుపట్టి పిలిచేవారు. హీరోయిన్ నుండి సహాయ పాత్రలో నటించే వాళ్ళతో పాటు అందరూ ఈ సీరియల్ ద్వారా ఫేమస్ అయిపోయారు. ఇదే సీరియల్ లో పవిత్ర నటించారు. పవిత్ర కి కూడా ఈ సీరియల్ చాలా మంచి పేరు తీసుకొచ్చింది. ఎక్కడికి వెళ్ళినా కూడా పవిత్రని తన పాత్ర పేరుతోనే పిలిచేవారు. అంతగా ఫేమస్ అయిపోయారు.

సీరియల్ లో పవిత్ర తిలోత్తమ అనే పాత్రలో నటించారు. పవిత్ర ఇండస్ట్రీకి రావడం అంత సులభంగా ఏమీ జరగలేదు. ఎన్నో కష్టాలను దాటుకొని పవిత్ర ఈ స్థాయికి వచ్చారు. పవిత్ర ఇండస్ట్రీకి రావాలి అనుకున్న కొత్తలో చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. ఎంతో మంది పవిత్రని ఇబ్బంది పెట్టారు. షూటింగ్స్ కి వెళ్ళినప్పుడు భోజనం పెట్టేవారు కానీ పారితోషకం సరిగ్గా ఇచ్చేవారు కాదు. దాంతో తగిన పారితోషకం లేకుండా కూడా పవిత్ర నటించారు. ఒక సందర్భంలో పవిత్ర ఇవన్నీ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పటి తరం వాళ్లు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అని, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అని పవిత్ర చెప్పారు.

ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో కెరీర్ నిలబెట్టుకోవడం అనేది చాలా కష్టమైన విషయం. కాబట్టి ప్రొఫెషన్ లో విలువలు ఉండేలాగా చూసుకోవాలి అని పవిత్ర అన్నారు. నిన్న పవిత్ర తుది శ్వాస విడిచారు. పవిత్ర భర్త చంద్రకాంత్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశారు. పవిత్ర తో కలిసి దిగిన ఫోటో షేర్ చేసి ఈ విధంగా రాశారు. ఈ పోస్ట్ లో, “పాపా నీతో దిగిన లాస్ట్ పిక్ రా. నన్ను వదిలేసి వెళ్ళిపోయావు అనే విషయాన్ని జీర్ణించుకోవడానికి కూడా కష్టంగా ఉంది. ఒక్కసారి మామా అని పిలువే. నా పవి ఇక లేదు. ప్లీజ్ రా మళ్లీ రా. ప్లీజ్” అని రాశారు. ఈ పోస్ట్ చూసిన వారిని కంటతడి పెట్టిస్తోంది.


End of Article

You may also like