గుప్పెడంత మనసు సీరియల్ లో కొత్త ట్విస్ట్..! పేపర్ యాడ్ ఇచ్చాక… తప్పుడు కాల్ చేసి..?

గుప్పెడంత మనసు సీరియల్ లో కొత్త ట్విస్ట్..! పేపర్ యాడ్ ఇచ్చాక… తప్పుడు కాల్ చేసి..?

by Harika

Ads

గుప్పెడంత మనసు సీరియల్ ఇప్పుడు కొత్త ట్రాక్ లోకి మారింది. కొంత కాలం నుండి హీరో రిషి కనిపించట్లేదు. సీరియల్ నుండి బయటికి వెళ్లిపోయారు అనే వార్త వచ్చింది. అయితే ఇప్పుడు మళ్లీ రిషి ఎంట్రీ అవుతోంది. గతం మర్చిపోయి, ఒక ఆటో డ్రైవర్ గా రిషి బతుకుతున్నట్టు సీరియల్ లో చూపించారు. శైలేంద్ర మనుతో, “వసుధార, నువ్వు ఎండి సీట్ కోసం రిషి బతికి ఉన్నాడు అని నాటకాలు ఆడుతున్నారు” అని అంటాడు. మను, “రిషి బతికే ఉన్నాడు” అని చెప్తాడు. అందుకు శైలేంద్ర, “ఎలా చెప్తున్నావు” అని అడుగుతాడు. అప్పుడు మను, “నమ్మకం” అని చెప్తాడు. అయితే, ఇప్పుడు రిషి కోసం వసుధార ప్రకటన ఇచ్చింది.

Video Advertisement

guppendantha manasu serial written update

పేపర్ ప్రకటన చూసిన దేవయాని అరుస్తుంది. ఫణీంద్ర, ధరణి వచ్చి ఏం జరిగింది అని అడిగితే, దేవయాని ప్రకటన గురించి చెప్తుంది. శైలేంద్ర కూడా వచ్చి, “రిషి లేడు అంటే వసుధార ఎందుకు నమ్మట్లేదు. మనమందరం ఇన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా కూడా దొరకలేదు అంటే అతను లేనట్టే కదా” అని అంటాడు. అప్పుడు దేవయాని, “ఈ విషయం మనకి అర్థం అయ్యింది. కానీ ఏం లాభం. రిషికి కర్మకాండలు అవ్వకుండా ఆపి వసుధార భూషణ్ ఫ్యామిలీ పరువు తీసింది” అని అంటుంది. “ఎండి సీట్ కోసం ఇదంతా చేస్తోంది” అని దేవయాని చెప్తుంది. అప్పుడు ఫణీంద్ర దేవయానిని తిట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు.

ఇంతలోపు పుల్లయ్య అనే ఒక వ్యక్తి రిషి సార్ లాగా ఉన్న మనిషిని తాను చూశాను అని చెప్పి, అడ్రస్ చెప్తాడు. దాంతో వసుధార, మను అక్కడికి వెళ్తారు. పుల్లయ్య కి ఫోన్ చేస్తారు. కానీ ఆ పుల్లయ్య అనే వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయడు. వీళ్లు వెతుకుతుంటే అక్కడ శైలేంద్ర ప్రత్యక్షం అవుతాడు. పుల్లయ్య పేరుతో ఫోన్ చేసింది శైలేంద్ర అని వసుధార అనుకొని వెళ్లి శైలేంద్ర అని తిడుతుంది. ఇక్కడితో ఇవాల్టి ఎపిసోడ్ అయిపోతుంది. ఇప్పుడు సీరియల్ వేగం పెరిగింది. కొంత కాలం నుండి రిషి వస్తాడు అని చెప్పి, మధ్యలో మళ్లీ మను ట్రాక్ తీసుకొచ్చి సీరియల్ అంతా మార్చేశారు. ఇప్పుడు మళ్లీ ఆడియన్స్ అంతగా అడగడంతో రిషి పాత్రని మళ్ళీ సీరియల్ లోకి తీసుకొస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ప్రోమోకి కూడా మంచి స్పందన వచ్చింది. సీరియల్ టైమింగ్స్ కూడా మారడంతో ఇప్పుడు సీరియల్ టిఆర్పి పెరిగే అవకాశం ఉంది అని అందరూ అంటున్నారు.


End of Article

You may also like