ఎమోషనల్ అయిన చందు భార్య..! “పవిత్ర జయరాం వచ్చాక ఇలా అయిపోయాడు..!” అంటూ..?

ఎమోషనల్ అయిన చందు భార్య..! “పవిత్ర జయరాం వచ్చాక ఇలా అయిపోయాడు..!” అంటూ..?

by Harika

Ads

సీరియల్ నటి పవిత్ర జయరాం విషయంలో మరొక కొత్త కోణం బయటికి వచ్చింది. పవిత్ర, తనతో సీరియల్ లో నటించిన చంద్రకాంత్ తో ప్రేమలో ఉన్నారు అనే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. చంద్రకాంత్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, పవిత్ర, తను భార్యాభర్తలం అని చెప్పారు. ఇదే విషయాన్ని కొన్నాళ్ల తర్వాత ప్రకటించాలి అని కూడా అనుకున్నారు అని అన్నారు. ఒక సినిమా గురించి బెంగళూరు వెళ్లి వస్తూ ఉంటే ఇలా జరిగింది అని అన్నారు. అయితే, చంద్రకాంత్ కి గతంలో పెళ్లి జరిగింది. శిల్ప అనే అమ్మాయిని చంద్రకాంత్ 11 సంవత్సరాలు ప్రేమలో ఉన్న తర్వాత పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Video Advertisement

chandrakanth wife about pavitra jayaram

చంద్రకాంత్ మరణం తర్వాత శిల్ప మాట్లాడుతూ, పవిత్ర జయరాం వచ్చాక చంద్రకాంత్ తనకి దూరం అయ్యారు అని అన్నారు. ముందంతా తనతో మాట్లాడకుండా ఉండేవారు కాదు అని, తర్వాత తనని చూస్తేనే చిరాకు వచ్చే అంత పరిస్థితి ఏర్పడింది అని అన్నారు. పవిత్ర జయరాం వచ్చాకే చంద్రకాంత్ లో మార్పు మొదలయ్యింది అని అన్నారు. పవిత్ర జయరాం బాబుతో ఈ విషయం మాట్లాడాలి అని ప్రయత్నించాను అని కూడా శిల్ప చెప్పారు. అందుకు ఆ అబ్బాయి, “వాళ్ల జీవితం. వాళ్ళ ఇష్టం” అని అన్నాడు అని శిల్ప అన్నారు. తనకి కొన్నాళ్ల క్రితం తల్లి చనిపోయారు అని, తల్లిదండ్రులు లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తనకి తెలుసు కాబట్టి, చంద్రకాంత్ తో, “పిల్లల కోసం అయినా నువ్వు బతకాలి” అని శిల్ప చెప్పారు.

అందుకు చంద్రకాంత్ కూడా తన పిల్లల కోసం తను బతుకుతాను అని, వాళ్ళని చూసుకుంటాను అని చెప్పారు అని శిల్ప అన్నారు. కానీ మరుసటి రోజు ఇలా చేశారు అని చెప్పారు. ఇన్ని సంవత్సరాలు చంద్రకాంత్ తనని ఎంత ఇబ్బంది పెట్టినా కూడా తన ఇంట్లో వాళ్ళకి ఈ విషయం చెప్పలేదు అని శిల్ప అన్నారు. ఇప్పుడే విషయం అంతా వారికి తెలిసింది అని చెప్పారు. ఏది ఉన్నా కూడా పిల్లలకు చెప్పుకోవడం, లేదా తన అత్తమామలకు చెప్పుకోవడం చేసేవారు అని అన్నారు. గతంలో పవిత్ర కి ఫోన్ చేసి ఈ విషయం గురించి మాట్లాడితే, “వాడు నా మొగుడు. ఏం చేసుకుంటావో చేసుకో” అని అన్నారు అని చెప్పారు. ఈ విషయంపై మాట్లాడుతూ శిల్ప తన బాధను వ్యక్తం చేశారు.

watch video :


End of Article

You may also like