నాచురల్ స్టార్ నాని మృణాల్ ఠాకూర్ జంటగా వచ్చిన చిత్రం హాయ్ నాన్న. తాజగా విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు మిశ్రమ స్పందన సంపాదించుకుంది. అయితే ఉండగా ఉండగా మౌత్ టాకుతో ఈ మూవీ వీకెండ్ లో మంచి కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడు బ్రేక్ ఈవెన్ దిశగా ఈ మూవీ కొనసాగుతుంది.వరల్డ్ వైడ్‌గా ఫస్ట్ వీకెండ్లో ఈ మూవీ నలభై కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్, పంతొమ్మిది కోట్లకుపైగా షేర్ వసూళ్లను దక్కించుకున్నట్లు సమాచారం.

ఏపీ, తెలంగాణలో తొలిరోజు 2.90 కోట్లు వరకు కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ, శనివారం రోజు మాత్రం 4 కోట్ల వరకు వసూళ్లను దక్కించుకున్నది. ఆదివారం రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీకి 4.5 కోట్ల వరకు వసూళ్లు వచ్చినట్లు సినీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.ఓవర్సీస్లో ఈ సినిమా దుమ్మురేపుతోంది. ఫస్ట్ వీకెండ్లోనే మిలియన్ డాలర్ క్లబ్లో చేరిపోయి రికార్డ్ క్రియేట్ చేసింది. ఫస్ట్ వీకెండ్ పూర్తి అయ్యేసరికి నైజం లో ఈ మూవీ 14 కోట్ల గ్రాస్ సాధించింది.
హాయ్ నాన్న మూవీ వరల్డ్ వైడ్‌గా 27 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైంది. మరో రెండు రోజుల్లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. తండ్రి కూతుర్ల సెంటిమెంట్ తో వచ్చిన ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

1. సిఎన్ అన్నాదురై:
2. ఎంజి రామచంద్రన్:
3. జానకీ రామచంద్రన్:
4. ఎన్టీ రామారావు:
5. జయలలిత:
6.ఎం కరుణానిధి
ఆయన రాజకీయాలలో అడుగుపెట్టి, 5 సార్లు సుమారు 2 దశాబ్దాల పాటు తమిళనాడుకు ముఖ్యమంత్రిగా పనిచేసారు.



సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘జైలర్’. ఈ చిత్రాన్ని బీస్ట్ మూవీ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. కళానిధి మారన్ సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జైలర్ పాటలకి, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ ఆగస్టు 10న తెలుగు, తమిళ భాషలలో విడుదల అయ్యింది. ఈ చిత్రం మొదటి రోజు పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దాంతో మొదటి రోజు వసూళ్లు భారీగా వచ్చినట్టు తెలుస్తోంది.
తాజాగా సోషల్ మీడియాలో సూపర్ స్టార్ రజినీకాంత్ వెడ్డింగ్ రిసెప్షన్ ఇన్విటేషన్ సోషల్ నెట్టింట్లో షికారు చేస్తోంది. తమిళ మూవీ ‘తిల్లు ముల్లు’ షూటింగ్ సమయంలో పరిచయమైన లతా రంగాచారిని రజనీకాంత్ వివాహం చేసుకున్నారు. తిల్లు ముల్లు మూవీ సెట్లో, ఎతిరాజ్ కాలేజీకి చెందిన ఇంగ్లీష్ లిటరేచర్ మేజర్ లత అప్పటికే స్టార్ స్టార్ గా రాణిస్తున్న రజనీకాంత్‌ను ఇంటర్వ్యూ చేసింది.
అయితే ఇంటర్వ్యూ ముగిసే సమయానికి, రజనీకాంత్ ఆమెను పెళ్లి చేసుకోమని అడిగాడు. లతా పెళ్ళికి అంగీకరించడంతో వారి వివాహం జరిగింది. 1981 లోని రజనీకాంత్ వెడ్డింగ్ రిసెప్షన్ ఇన్విటేషన్ ప్రస్తుతం నెట్టింట్లో సందడి చేస్తోంది. ఈ కార్డ్ పై స్టైలిష్ గా ఉన్న రజనీకాంత్ ను చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.









