Ads
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సౌత్ ఇండియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బిగ్గెస్ట్ స్టార్ రజనీకాంత్. ఏడు పదుల వయసులోనూ సినిమాలలో నటిస్తూ, బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేస్తున్నారు.
Video Advertisement
రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ జైలర్ తాజాగా థియేటర్లలో రిలీజ్ అయ్యి, భారీ వసూళ్లను కలెక్ట్ చేస్తూ రికార్డులు సృష్టిస్తోంది. ఇది ఇలా ఉంటే సూపర్ స్టార్ రజినీకాంత్ వెడ్డింగ్ రిసెప్షన్ ఇన్విటేషన్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.. సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘జైలర్’. ఈ చిత్రాన్ని బీస్ట్ మూవీ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. కళానిధి మారన్ సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జైలర్ పాటలకి, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ ఆగస్టు 10న తెలుగు, తమిళ భాషలలో విడుదల అయ్యింది. ఈ చిత్రం మొదటి రోజు పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దాంతో మొదటి రోజు వసూళ్లు భారీగా వచ్చినట్టు తెలుస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో సూపర్ స్టార్ రజినీకాంత్ వెడ్డింగ్ రిసెప్షన్ ఇన్విటేషన్ సోషల్ నెట్టింట్లో షికారు చేస్తోంది. తమిళ మూవీ ‘తిల్లు ముల్లు’ షూటింగ్ సమయంలో పరిచయమైన లతా రంగాచారిని రజనీకాంత్ వివాహం చేసుకున్నారు. తిల్లు ముల్లు మూవీ సెట్‌లో, ఎతిరాజ్ కాలేజీకి చెందిన ఇంగ్లీష్ లిటరేచర్ మేజర్ లత అప్పటికే స్టార్ స్టార్ గా రాణిస్తున్న రజనీకాంత్‌ను ఇంటర్వ్యూ చేసింది.
అయితే ఇంటర్వ్యూ ముగిసే సమయానికి, రజనీకాంత్ ఆమెను పెళ్లి చేసుకోమని అడిగాడు. లతా పెళ్ళికి అంగీకరించడంతో వారి వివాహం జరిగింది. 1981 లోని రజనీకాంత్ వెడ్డింగ్ రిసెప్షన్ ఇన్విటేషన్ ప్రస్తుతం నెట్టింట్లో సందడి చేస్తోంది. ఈ కార్డ్ పై స్టైలిష్ గా ఉన్న రజనీకాంత్ ను చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
Also Read: “చిరంజీవి, బాలకృష్ణ” లు… “రజనీకాంత్, కమల్ హాసన్” ని చూసి నేర్చుకుంటే బాగుంటుంది అనుకుంటా..?
End of Article