అన్నయ్య లైఫ్ మార్చేసిన తమ్ముడు…దశ తిరిగిపోయిందిగా…!

అన్నయ్య లైఫ్ మార్చేసిన తమ్ముడు…దశ తిరిగిపోయిందిగా…!

by kavitha

ప్రణయ్ రెడ్డి వంగ ఈ పేరంటే ఎవరికి తెలియకపోవచ్చు గాని,సందీప్ రెడ్డి వంగ అన్నయ్యగా అందరికీ పరిచయమే. సందీప్ రెడ్డి తీసిన యానిమల్, అర్జున్ రెడ్డి సినిమాలకు నిర్మాత ప్రణయ్ రెడ్డి. ప్రణయ రెడ్డి అమెరికాలో జాబ్ చేసుకునేవారు. అలాంటిది తన తమ్ముడు సందీప్ రెడ్డికి సినిమాల మీద ఇంట్రెస్ట్ వల్ల జాబు వదిలేసి వచ్చి తానే నిర్మాతగా మారి అర్జున్ రెడ్డి సినిమా తీశారు. ఈ సినిమా ఎంతటి సెన్సేషనల్ విజయం సాధించింది అందరికి తెలిసిందే.

Video Advertisement

ఆ తర్వాత ప్రణయ్ రెడ్డి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. సందీప్ రెడ్డి తీసే ప్రతి సినిమాలోని ప్రణయ్ రెడ్డి నిర్మాణ భాగస్వామిగా ఉంటారు. యానిమల్ సినిమాకు బడ్జెట్ 200 కోట్లు అయింది. ఈ సినిమా ఇప్పటివరకు 600 కోట్లపైనే కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమాలో నిర్మాత ప్రణయ రెడ్డి షేర్ దాదాపు 200 కోట్లు ఉండవచ్చని అంచనా. తన తమ్ముడిని నమ్ముకుని అమెరికాలో జాబు వదిలేసి వచ్చిన ప్రణయ్ రెడ్డికి లైఫ్ సెటిల్ అయిపోయింది అని అంటున్నారు.

అయితే ఈ సక్సెస్ అనేది అంత ఈజీగా దక్కలేదు. అర్జున్ రెడ్డి సినిమాకి నిర్మాతలు ఎవరు ముందుకు రాకపోవడంతో ప్రణయ్ రెడ్డి తన తమ్ముడి మీద ఉన్న నమ్మకంతో ధైర్యం చేసి తమకు ఉన్న 32 ఎకరాల భూమిని అమ్మి కోటిన్నరతో అర్జున్ రెడ్డి సినిమాని మొదలుపెట్టారు. ఆరోజు తన తమ్ముడిని ఎవరు నమ్మని సమయంలో ప్రణయ్ రెడ్డి నమ్మాడు కాబట్టే ఈ రోజు తమ్ముడి వల్ల తనకి ఈ సక్సెస్ లభించింది.


You may also like

Leave a Comment