దేశంలో ఉండే ఆర్థిక పరిస్థితులను బట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెన్సీ నోట్లను ముద్రిస్తుంది. ఆర్బీఐ ముద్రించే ప్రతి ఒక నోటు పై ప్రత్యేకమైన గుర్తింపు నంబర్‌తో పాటుగా కొన్ని రకాల గుర్తులను కూడా ముద్రిస్తుంది. వీటి వల్లనే ఒక నోటు నిజమైనదా, నకిలీదా అనేది గుర్తిస్తారు.
ఆర్బీఐ ఇటీవలే 2000 రూపాయల కరెన్సీ నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. అప్పటి నుండి నోట్ల గురించి అనేక వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా స్టార్ గుర్తు ఉన్న నోట్లు నకిలివనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీని పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లారిటీ ఇచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకున్నప్పటి నుండి నోట్ల పై చాలా వార్తలు వస్తున్నాయి. అలా 500 రూపాయల నోట్లను కూడా ఉపసంహరించుకుంటున్నారనే వార్తలు వైరల్ గా మారాయి. ఆర్బీఐ దాని పై స్పందించి, అది నిజం కాదని తెలిపింది.
ప్రస్తుతం స్టార్ గుర్తు ఉన్న నోట్లు నకిలివనే వార్త నెట్టింట్లో వైరల్ అవడంతో ఆర్బీఐ తాజాగా వాటి గురించి క్లారిటీ ఇచ్చింది. జులై 27 ఇచ్చిన ప్రకటనలో ప్రస్తుతం ఉన్ననోట్లతో సమానంగానే స్టార్ గుర్తు ఉన్న నోట్లు కూడా చెల్లుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ స్టార్ గుర్తు బ్యాంక్ సీరియల్ సంఖ్యలో ఉంటుంది. అయితే, ఇప్పుడు ముద్రిస్తున్న కొత్త నోట్లలో స్టార్ గుర్తు ఉండదు.
ఈ గుర్తుతో నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఎందుకు ముద్రిస్తుందంటే, ఆ నోట్లు ఇతర నోట్లను స్థానంలో వచ్చినవి లేదా రీప్రింటెండ్ అయిన బ్యాంక్ నోట్లుగా గుర్తించడం కోసమే. చిరిగిన, పాడైన నోట్ల ప్లేస్ లో ముద్రించే నోట్లకు మాత్రమే నంబర్ సిరీస్‌లో స్టార్ గుర్తును పెట్టామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.
Also Read: దయనీయ స్థితిలో తెలంగాణ యువతి… మంత్రికి లేఖ రాసిన తల్లి..! కంటతడి పెట్టిస్తున్న సంఘటన..!

కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ, ఈ సంవత్సరం అక్టోబర్, నవంబర్ లో వన్డే ప్రపంచకప్ ఇండియాలో జరగనుందని, ఇప్పటి నుంచే దాని కోసం ప్రిపేర్ అవుతున్నట్లుగా తెలిపాడు. ఈ క్రమంలోనే అందరికీ బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఇవ్వాలని అనుకున్నామని, ఆ కారణంతోనే బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేసినట్లు వెల్లడించాడు. వరల్డ్ కప్ కోసం ప్లేయర్ల సత్తాను టెస్ట్ చేస్తామని, ఫలితాలపై రాజీపడనని అన్నారు.
ఒక వైపు ఆటలో ప్రయోగాలు చేస్తూ, ఇంకో వైపు గెలుపు కోసం కష్టపడతామని పేర్కొన్నాడు. అలాగే రోహిత్ శర్మ ఏడవ స్థానంలో బ్యాటింగ్‌కు చేయడం పైన స్పందించాడు. 7వ స్థానంలో బ్యాటింగ్ తనకు కొత్త కాదని, కెరీర్ మొదట్లో 7వ స్థానంలోనే బ్యాటింగ్ చేసేవాడినని తెలిపాడు. మొదటి వన్డేలో బ్యాటింగ్ చేసినపుడు ఆ రోజులు గుర్తుకు వచ్చాయని అన్నాడు. కానీ అందరికీ అన్నిమ్యాచ్లలో అవకాశాలు వస్తాయని గ్యారంటీగా చెప్పలేమని అన్నాడు.
సంజు శాంసన్‌ను మొదటి వన్డేలో ఎందుకు ఆడించలేదు అని మీడియా అడుగగా, ఎడమ, కుడి కాంబినేషన్ కోసమే అతన్ని పక్కన పెట్టినట్లుగా తెలిపాడు. ప్రపంచ కప్ నేపథ్యంలో ఎలాంటి డౌట్స్ లేకుండా జట్టు కాంబినేషన్ సెలెక్ట్ చేసుకోవాలని భావిస్తున్నటు రోహిత్ తెలిపాడు. ఇషాన్ కిషన్ మొదటి వన్డేలో బాగా ఆడాడని అతని పై ప్రశంసలు కురిపించాడు.
బ్రో మూవీలో సాయి తేజ్ కి ఇద్దరు సిస్టర్లు ఉంటారు. వారిలో ఒకరు ప్రియా వారియర్ కాగా, రెండవ సిస్టర్ గా యువ లక్ష్మి నటించింది. ఆమె అసలు పేరు యువశ్రీ లక్ష్మి. ఆమె కోలీవుడ్ నటి, తమిళంలో పలు సినిమాలలో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళనాడు లోని కారైకాల్ లో 2000వ సంవత్సరంలో డిసెంబర్ 25న జన్మించింది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన యువలక్ష్మికి భరతనాట్యం అంటే చాలా ఆసక్తి. ఆ నృత్యం నేర్చుకున్న ఆమె జాతీయ అవార్డుతో సహా అనేక అవార్డులను పొందింది.
ఆమె మొదటిసారి 2016 లో వచ్చిన అమ్మ కనక్కు అనే తమిళ చిత్రంలో అమలా పాల్ మరియు సముద్రఖనితో కలిసి నటించింది. ఆ తరువాత సముద్రఖని ‘అప్పా’ లో ప్రధాన పాత్రలో నటించింది. ఆమె ‘ఆకాశమిత్తయి’ అనే సినిమా ద్వారా మలయాళంలో ఎంట్రీ ఇచ్చింది.
ఆ తరువాత శివకార్తికేయన్ నటించిన ‘వేలైకారన్ ‘ రాఘవ లారెన్స్ మూవీ కాంచన 3లో కూడా సహాయక నటి పాత్రలో యువ లక్ష్మి నటించింది. సముద్రఖని దర్శకత్వం వహించి, నటించిన వినోదయ సీతమ్ సినిమాలో కూడా యువ లక్ష్మి కీలక పాత్రలో నటించింది. దూరదర్శన్ లో ప్రసారం అయిన సూపర్ కుటుంబంలో కూడా చేసింది. బ్రో మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.
ప్రతీక్ష జిక్కర్ అనే యువతి బెంగళూరులోని ఒక కంపెనీకి సంబంధించిన జాబ్ ప్రకటన చూసి ఆ ఇంటర్వ్యూకి హాజరు అయ్యింది. అలా వెళ్ళి ఆమె 3 రౌండ్ల వరకు జరిగిన ఇంటర్వ్యూలో నెగ్గింది. కానీ ఉద్యోగానికి మాత్రం సెలెక్ట్ కాలేదు. ఆమె జాబ్ కి సెలెక్ట్ ఎందుకు కాలేదో సదరు కంపెనీ కారణాన్ని తెలుపుతూ ఆమెకు మెయిల్ ను పంపించింది.
ఆ మెయిల్ లో ఏముందంటే, ‘జాబ్ పొందడానికి కావలసిన అన్ని అర్హతలు, నైపుణ్యాలు మీకు ఉన్నాయి. అయితే మీ స్కిన్ టోన్ మా టీంతో మ్యాచ్ అవలేదు. మీ స్కిన్ కలర్ తెల్లగా ఉండటం వల్ల మా టీంలో విభేదాలు వస్తాయని కంపెనీ యాజమన్యం భావించింది. అందువల్ల మీకు ఈ జాబ్ ఇవ్వలేం’ అని మెయిల్లో సదరు కంపెనీ పేర్కొంది. ఈ మెయిల్ తో ఖంగు తిన్న ప్రతీక్ష జిక్కర్ ఆ కంపెనీ నుంచి వచ్చిన ఆ మెయిల్ స్క్రీన్ షాట్‌ను తీసి సోషల్ మీడియాలో తన ఖాతాలో షేర్ చేసింది.
వాస్తవానికి కంపెనీ మెయిల్ ను చూసి చాలా ఆశ్చర్యపోయాను, మనిషి కలర్ బట్టి కూడా జాబ్ ఇస్తారని నేను అసలు ఊహించలేదు. మనిషి రంగును బట్టి కాకుండా టాలెంట్ ను బట్టి జాబ్ ఇవ్వాలని సదరు కంపెనీని ఈ పోస్ట్ లో కోరింది. ప్రతీక్ష షేర్ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్ట్ చూసిన నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.
మారుతున్న టెక్నాలజీతో ప్రపంచం కొత్త మార్గాలలో వెళ్తోంది. నిత్యం ఎన్నో ఆవిష్కరణలు వస్తూనే ఉన్నాయి. ఇక సాంకేతికతను వాడుకుంటూ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సరికొత్త కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. దీనికి హైదరాబాద్‌కు చెందిన స్టార్ట్ అప్ కంపెనీ రిసైకల్ సహకారాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చింది.
ఇవి ఏం చేస్తాయంటే కస్టమర్ నుండి చెత్తను తీసుకుని, దానికి బదులుగా పెట్రోల్‌ను ఇస్తారు. హైదరాబాద్ లోనే ఫైలన్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. జూన్ 5, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇండియన్ ఆయిల్ సంస్థ చైర్మన్, ఎస్ఎం వైద్య, హైదరాబాద్‌లో ప్రారంభించారు.
శ్రీ మీడియా మనీ అనే ఇన్ స్టాగ్రామ్ పేజీలో చెత్తతో ఫ్రీ పెట్రోల్ అనే విషయం గురించి తెలిపారు. అందులో “మీ దగ్గర ఉన్న పేపర్లు, ప్లాస్టిక్, మొబైల్స్, వైఫై మోడెమ్స్ కానీ, ల్యాప్‌టాప్, డ్రై వెస్ట్ లేదా వేట వెస్ట్ కానీ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ స్టేషన్ లో ఉండే రిసైకల్ సంస్థ వారికి ఇస్తే మీ ముందే బరువు చూసి, పెట్రోల్ ఇస్తారు. 5 కేజీల చెత్తను ఇస్తే 680 పాయింట్స్ ఇస్తారు. ప్రతి పాయింట్ కి 1 ఎంఎల్. ఒకవేళ 10 కిలోల చెత్తను ఇస్తే, ఒక లీటర్ పెట్రోల్ వస్తుంది. ఇలా ఇచ్చే ప్లేస్ ఎక్కడంటే, హైటెక్ సిటీ, ఐకియా, బేగం పేట్, మియాపూర్ లో ఉన్నాయి” అని చెప్పుకొచ్చారు.
ఇటీవల వచ్చిన ‘గుడ్ నైట్’ సినిమాలో హీరోకు ‘గురక’ సమస్య ఉన్నట్టే, ‘జానకి జానే’ మూవీలో హీరోయిన్ కు ‘భయం’ అనే మానసిక సమస్య ఉంటుంది. ఆ సమస్య ఆమె జీవితాన్ని ఎలా మార్చిందో ఈ మూవీలో చూపించారు. సైజు కురుప్, నవ్య నాయర్ ప్రధాన పాత్రలలో నటించగా, జానీ ఆంటోనీ, కొట్టాయం నజీర్, జార్జ్ కోరా, అనార్కలి మరికర్, షరఫ్ వంటివారు ఇతర కీలక పాత్రలలో నటించారు.
ఈ మూవీ కథ విషయనికి వస్తే, మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువతి జానకి (నవ్య నాయర్), చిన్నప్పుడే తండ్రి మరణించడంతో ఫ్యామిలీ భారం ఆమె పైనే పడుతుంది. అమ్మతో ఉంటూ ఒక ప్రెస్ లో వర్క్ చేస్తుంటుంది. అయితే జానకికి భయం ఎక్కువగా ఉంటుంది. గట్టిగా ఎవరైనా మాట్లాడినా, ఎక్కడికైనా ఒంటరిగా వెళ్లాలన్నా, చీకటిగా ఉన్న చాలా భయపడుతుంది. ఒకసారి భయంతో జానకి స్పృహ తప్పి పడిపోగా, రోడ్ కాంట్రాక్టర్ అయిన ఉన్ని ముకుందన్ (సైజు కురుప్) రక్షించి, ఇంటికి తీసుకెళ్తాడు.
జానకిని ప్రేమించిన ఉన్ని ముకుందన్ వారి పెద్దలను ఒప్పించి మరి జానకిని పెళ్లి చేసుకుంటాడు. సంతోషంగా సాగుతున్న వీరి లైఫ్ లో ఎదురైన అనుకోని సంఘటన ఏమిటి ? దాన్ని రాజకీయ ప్రత్యర్థులు అయిన షాజీ (కొట్టాయం నజీర్), మార్టిన్ (జార్జ్ కోరా) ఎలా ఉపయోగించుకున్నారు? దానివల్ల ఉన్ని, జానకి ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి? ఆఖరికి ఏం జరిగింది? అనేది మిగిలిన కథ.
ఇన్నాళ్లూ ఐటమ్ సాంగ్స్ తో ప్రేక్షకులని అలరించిన బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా, ఇప్పుడు ఒక ట్వీట్‌తో అనే కంటే ట్వీట్లోని రాసిన పదంతో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ తో సోషల్ మీడియాలో ఆమెను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. మరో వైపు ఆ ట్వీట్ కి సంతోషంతో కూడా కామెంట్లు పెడుతున్నారు. బ్రో మూవీ రిలీజ్ సందర్భంగా మూవీ యూనిట్ కు విషెస్ చెప్తూ ట్వీట్ చేసింది.
ట్రోల్ చేసేంతగా ఆ ట్వీట్ లో ఏముంది అంటే “మా చిత్రం #BroTheAvatar రేపు 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. ఈ మూవీలో గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ సీఎం @పవన్ కళ్యాణ్ గారితో స్క్రీన్ స్పేస్‌ను చేసుకోవడం సంతోషంగా ఉంది. మరణించిన తర్వాత తన తప్పులను సరిదిద్దుకోవడానికి ఒక వ్యక్తి సెకండ్ ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుందనేదే ఈ కథ.’’ అని ఊర్వశి రౌతేలా రాసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి అని అనడంతో నెటిజన్లు, ప్రత్యర్ధి పార్టీల ఫ్యాన్స్ మాత్రం ఊర్వశిని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.
దర్శకుడు నాగ్ అశ్విన్ ‘కల్కి 2898 ఏడీ’ సైన్స్ ఫిక్షన్ సినిమాగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో హీరో ప్రభాస్ కల్కి పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. కొన్ని రోజులుగా కల్కి 2898 ఏడీ సినిమాకి సీక్వెల్ ఉంటుందని వినిపిస్తోంది. ఈ విషయం గురించి దర్శకుడు నాగ్ అశ్విన్ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
అలాగే మూవీలో ప్రభాస్‌ను ఎందుకు తీసుకున్నారనే విషయం గురించి కూడా మాట్లాడారు. ‘కల్కి 2898 ఏడీ’ సినిమా సీక్వెల్ గురించి ఇప్పుడు తాను ఆలోచించడం లేదని నాగ్ అశ్విన్ అన్నారు. అలాగే ఈ మూవీ ఫ్రాంచైజీ గురించి కూడా ఇంత వరకు ఏం ప్లాన్ చేయలేదని చెప్పారు.
ఇక ‘కల్కి 2898 ఏడీ’ స్టోరీ రాసుకునే సమయంలో ఎవరు హీరో అయితే బాగుంటుందని ఆలోచించానని అన్నారు. ఆ సమయంలో ఆ క్యారెక్టర్ లో ప్రభాస్‌ను ఊహించుకునే ఈ స్టోరీ రాసుకున్నానని తెలిపారు. ఈ స్టోరీ కోసం తన ఆలోచనలో ప్రభాస్ మాత్రమే ఉన్నాడని, అందుకే ప్రభాస్ నే ఈ మూవీకి హీరోగా ఎంచుకున్నట్లు దర్శకుడు నాగ్ అశ్విన్ వెల్లడించారు.
వల్లిపురం వసంతన్ ను నామ్ డి గెర్రే కెప్టెన్ మిల్లర్ అని పిలుస్తారు. శ్రీలంకలోని వేర్పాటువాద తమిళ మిలిటెంట్ సంస్థ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (LTTE) లో వసంతన్ సభ్యుడు. అతనే LTTE మొట్ట మొదటి బ్లాక్ టైగర్ గా పిలవబడ్డాడు. మిల్లర్ 1966లో జనవరి1న శ్రీలంకలో జన్మించాడు. అతను తున్నలైకి చెందిన వ్యక్తి. అతని తండ్రి బ్యాంక్ మేనేజర్, అతనికి ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు. వసంతన్ పాయింట్ పెడ్రోలోని హార్ట్లీ కాలేజీలో చదువుకున్నాడు.
బ్లాక్ జులై తమిళ వ్యతిరేక అల్లర్ల వల్ల బాధితులయినవారి బాధలను చూసి తీవ్రంగా ప్రభావితమైన వసంతన్ 1983లో LTTEలో డ్రైవర్‌గా చేరాడు. ఒక సంవత్సరం తర్వాత అతను LTTE సభ్యుడుగా మారాడు. అప్పుడే అతనికి నామ్ డి గెర్రే మిల్లర్ (మిల్లర్) అనే పేరు వచ్చింది. వడమరచ్చి ఆపరేషన్ (ఆపరేషన్ లిబరేషన్) టైమ్ లో శ్రీలంక ఆర్మీ నెల్లియాడి మధ్య మహా విద్యాలయాన్ని స్వాధీనం చేసుకుని సైనిక స్థావరంగా మార్చింది. భారీగా పటిష్టపరచబడిన ఆ స్థావరాన్ని స్వాధీనం చేసుకోవాలని LTTE నిర్ణయించింది.
దాని కోసం బాంబులతో నింపిన వాహనాన్ని ఆ స్థావరం మధ్యలోకి తీసుకెళ్లాడానికి మిల్లర్ తనకు తానే ముందుకు వచ్చాడు. దానికి ముందుగా మిల్లెర్ 1987లో జూన్29 కుటుంబాన్ని, స్నేహితులను కలిశాడు. అదే ఏడాది జూలై 5న LTTE ఒక ట్రక్కులో బాంబులను నింపారు. ఆ తరువాత మిల్లర్ ఆ ట్రక్కును నడుపుకుంటూ నెల్లియాడి మధ్య మహా విద్యాలయంలో ఉన్న ఆర్మీ క్యాంపులోకి తీసుకెళ్ళాడు. సైనికులు కాల్పులు జరపడంతో మిల్లర్ చనిపోయాడు. కాని ట్రక్ వెళ్తూ ప్రధాన భవనంలోకి దూసుకెళ్లి అక్కడ పేలిపోయింది.
పేలుడుతో బస్సు అంత పరిమాణంలో పెద్ద బిలం ఏర్పడింది. మిల్లర్ ట్రక్కును అనుసరిస్తూ వెళ్ళిన ఇతర LTTE కార్యకర్తలు ఆర్మీ శిబిరం మీద దాడి చేసి, స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో ఎంతో మంది సైనికులు చనిపోయారు. చాలామంది గాయపడ్డారు. ఈ సంఘటన అంతా వీడియో తీయబడింది. మిల్లర్ చనిపోయిన తరువాత కెప్టెన్‌గా పదోన్నతి పొందాడు. మిల్లర్ LTTEలో గౌరవనీయమైన వ్యక్తిగా పరిగణించబడ్డాడు. అంతేకాకుండా LTTE ఆత్మాహుతి విభాగం బ్లాక్ టైగర్స్ చిహ్నం పై మిల్లర్ ముఖ చిత్రాన్ని పెట్టారు.
జూలై 5ను బ్లాక్ టైగర్స్ డే గా మార్చారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులకు బ్లాక్ టైగర్ అమరవీరులందరిని స్మరించుకునే రోజు. నెల్లియాడి మధ్య మహా విద్యాలయంలో మిల్లర్ బంగారు విగ్రహంతో పాటు ఒక మందిరాన్ని కూడా నిర్మించారు. అయితే 1996లో శ్రీలంక సైన్యం వడమరచ్చి ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత మిల్లర్ మందిరాన్ని ధ్వంసం చేశారు. కానీ స్థానికులు మిల్లర్ విగ్రహాన్ని దాచిపెట్టారు.
2002లో నార్వేజియన్ మధ్యవర్తిత్వంతో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన సమయంలో కొత్త స్మారక ఫలకంను మరియు మిల్లర్ విగ్రహంను తిరిగి స్థాపించారు. యుద్ధం మళ్ళీ ప్రారంభమైన తర్వాత, 2006లో ఆగస్టు23న మిల్లర్ విగ్రహం పై దాడి చేసి ధ్వంసం చేశారు. అలాగే మందిరం యొక్క అవశేషాలను, మిల్లర్ విగ్రహం ఉన్న వేదిక, రాతి స్మారక ఫలకంను కూడా సైన్యం ధ్వంసం చేసింది.
రామిరెడ్డి టాలీవుడ్ లో అంకుశం సినిమా ద్వారా నట జీవితాన్ని మొదలుపెట్టారు. ఈ మూవీలో ‘స్పాట్ పెడుతా’ అనే ఒక్క డైలాగ్‌తో ఆడియెన్స్ భయపడేలా చేశారు. దాంతో ఆయన పేరు అంకుశం రామిరెడ్డిగా మారింది. అసలు పేరు గంగసాని రామిరెడ్డి, ఆ మూవీ తరువాత వరుసగా అవకాశాలు రావడంతో అప్పట్లో ఉన్న స్టార్ హీరోలందరితోనూ నటించారు. రామి రెడ్డి ఇండియాలోని అన్ని భాషల సినిమాలలో నటించారు.
1959లో జనవరి 1న జన్మించిన రామిరెడ్డి కెరీర్ మొదట్లో సినిమాల వైపు దృష్టి సారించలేదు. జర్నలిస్ట్ కావాలనే ఉద్దేశ్యంతో హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజంలో గ్రాడ్యుయేషన్ చేశారు. అది పూర్తి కాగానే ఒక వార్తాపత్రికలో జర్నలిస్ట్‌గా చేరారు. అందులో భాగంగా సినీ సెలెబ్రెటీల ఇంటర్వ్యూలను రామిరెడ్డి తీసుకునేవారు. ఆ క్రమంలో రామిరెడ్డి ఒకసారి ప్రముఖ డైరెక్టర్ కోడి రామకృష్ణ ఇంటర్వ్యూ కోసం వెళ్లారు. అప్పుడు రామిరెడ్డి ప్రతిభను చూసి ముగ్ధుడైన కోడి రామకృష్ణ తను తీయబోయే సినిమాలో రామిరెడ్డికి విలన్ క్యారెక్టర్ ఇచ్చారు.
అలా వీరిద్దరి కాంబోలో వచ్చిన మూవీనే అంకుశం. ఈ మూవీ రిలీజ్ అయ్యి, బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ మూవీనే రామిరెడ్డి కెరీర్ కి టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఈ మూవినే బాలీవుడ్ లో ప్రతిబంధ్ టైటిల్ తో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీమేక్ చేశారు. ఆ మూవీలో కూడా విలన్ గా రామిరెడ్డి నటించాడు. అక్కడ ప్రతిబంద్ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీతో చిరంజీవి కంటే విలన్ గా నటించిన రామిరెడ్డి యాక్టింగ్ బాలీవుడ్ ఇండస్ట్రీ ఫిదా అయింది. దాంతో బాలీవుడ్ లో రామిరెడ్డి భారీగా అవకాశాలు వచ్చాయి.
90వ దశకంలో, బాలీవుడ్లో రామిరెడ్డి పాపులర్ ఫేస్‌గా నిలిచారు. తెలుగు, హిందీలో నటిస్తూనే రామిరెడ్డి ఇతర భాషల్లో కూడా నటించి మెప్పించారు. అలా ఆయన కెరీర్ మొత్తంలో దాదాపు 250కి పైగా చిత్రాలలో నటించారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో అమ్రిష్ పూరి, ప్రేమ్ చోప్రా, డానీ డెంజోంగ్పా,అమ్జాద్ ఖాన్, గుల్షన్ గ్రోవర్ వంటి విలన్లకు ఏ విధంగా తీసిపోని అరుదైన యాక్టర్ అయిన రామిరెడ్డి జీవితం మాత్రం అర్ధాంతరంగా ముగిసిపోయింది.
రామిరెడ్డి చివరి వరకు తన నటనతో ఆడియెన్స్ ని అలరించాలని కోరుకున్నారు. కానీ 2010లో ఆయన ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది. కాలేయ క్యాన్సర్‌తో ఉందని వైద్యులు గుర్తించి, రామిరెడ్డికి తెలిపారు. రోజురోజుకు ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఆఖరి రోజుల్లో అయితే రామిరెడ్డి గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు. చివరికి 2011 లో ఏప్రిల్ 14న 52 ఏళ్ల వయసులో రామిరెడ్డి కన్నుమూశారు.
చనిపోయే కొద్ది రోజుల ముందు నుండే భార్య, పిల్లలు ఏమవుతారనే ఆలోచనతో ఆయన నరకం అనుభవించారని రామిరెడ్డి సన్నిహితులు చెబుతుంటారు. రామిరెడ్డికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారని తెలుస్తోంది. ఆయన కుమారుడు ప్రస్తుతం తండ్రి రామిరెడ్డి పేరుతో స్వీట్ షాప్ నడుపుకుంటూ జీవిస్తున్నారని తెలుస్తోంది.