ఫేమ్ అనేది ఓవర్ నైట్ ఎప్పుడైనా రావచ్చు.. కానీ అది నిలబడుతుంది అన్న గ్యారెంటీ మాత్రం లేదు. కొంతమంది మాత్రం బాగా క్లిక్ అవుతారు కానీ కొంతమంది ఎంత ఫాస్ట్‌గా ఫేమస్ అవుతారు అంతే ఫాస్ట్‌గా కనుమరుగైపోతారు. సోషల్ మీడియాలో నీలి కళ్ల అబ్బాయిగా గుర్తింపు తెచ్చుకున్న పాకిస్థానీ చాయ్వాలా ఇదే రకంగా ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు.
కరెక్ట్ గా ఏడు సంవత్సరాల క్రితం ఒక ఫోటోగ్రాఫర్ దృష్టిలో అనుకోకుండా పడ్డ ఈ ఛాయ్ వాలా ఆ తర్వాత ప్రపంచం దృష్టిని తన వైపుకు ఆకర్షించాడు. దీంతో ఓవర్ నైట్ ఒక్కసారిగా అతనికి ఎక్కడలేని పాపులారిటీ వచ్చి పడింది. ఆ తరువాత మోడల్‌గా మరియు యాక్టర్‌గా అతని కెరియర్ మారిపోయింది. ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిన ఇతను ఆ తరువాత ఏమయ్యాడు అన్న విషయం చాలామందికి తెలియదు.

ఒకే ఒక ఫోటోతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిన చాయ్‌వాలా పేరు అర్షద్ ఖాన్. ఇతనికి 17 మంది తోబుట్టువులు ఉన్నారు. జీవనోపాధి కోసం టీ స్టాల్ పెట్టుకొని కుటుంబ భారం మోస్తున్న అర్షద్ అనుకోకుండా ఒక రోజు జియా అలీ అనే ఇస్లామాబాద్ ఫోటోగ్రాఫర్ ఫోటో కి చిక్కాడు. 2016లో జియా తన దుకాణంలో ఉన్న అర్షద్ ఫోటోను తీసి పోస్ట్ చేయడం జరిగింది. చాలా కొద్ది సమయానికి ఈ ఫోటో బాగా వైరల్ అయింది. దీంతో అతని లైఫ్ జీని దొరికిన అలావుద్దీన్ లాగా మారిపోయింది.

ఒకపక్క అడ్వర్టైజ్మెంట్ ,మరొక పక్క మోడలింగ్ ,ఇంకోపక్క యాక్టింగ్.. ఇలా అతని కెరియర్ బాగా పుంజుకుంది. అయితే ఈ సంఘటన జరిగి ఏడు సంవత్సరాలు అవుతోంది.. మళ్లీ ఇప్పుడు ఇంత కాలానికి తిరిగి అతని గురించి చాలామంది ఎంక్వయిరీ చేస్తున్నారు. దీనికి కారణం ఒక ఛాయ్ వాలా గా పరిచయమైన ఇతను ఇప్పుడు లండన్ లో ఇల్‌ఫోర్డ్ లేన్‌లో కొత్తగా ఖాన్స్ కేఫ్ ఛాయ్ వాలా అనే సరికొత్త కేఫ్ ప్రారంభించడమే.
watch video :
https://www.instagram.com/reel/CuvDFleI2KP/?utm_source=ig_web_copy_link
ALSO READ : హీరో “వేణు” ది సినిమాల్లో సొంత గొంతు కాదా..? వేణుకి డబ్బింగ్ చెప్పే ఆర్టిస్ట్ ఎవరంటే..?
