ప్రభాస్, కృతి సనన్ నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. ఈ చిత్రం రామాయణం ఆధారంగా తెరకెక్కింది. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు.
ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించారు. ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు రామాయణం ఆధారంగా రూపొందిన చిత్రాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1. సీతారామ కళ్యాణం:
ఎన్.టి. రామారావు గారి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘సీతారామ కళ్యాణం’. ఈ సినిమాలో ఎన్టీఆర్ రావణుడి పాత్ర లో నటించారు.ఈ సినిమాలో రాముడుగా హరనాథ్, సీతగా గీతాంజలి నటించారు.
2. సంపూర్ణ రామాయణం- 1958:
1958లో వచ్చిన ఈ చిత్రంలో రాముడిగా ఎన్టీ రామారావు, సీతగా పద్మిని నటించారు. ఈ చిత్రంలో భరతుడిగా శివాజీ గణేశన్ నటించారు.
3. లవకుశ:
సి. పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన ‘లవకుశ’ సినిమాలో రాముడుగా ఎన్టీఆర్, సీతాగా అంజలీ దేవి నటించారు. ఈ చిత్రం 1963 లో విడుదల అయ్యింది.
4. పాదుకా పట్టాభిషేకం:
1966 లో విడుదల అయిన ఈ చిత్రంలో రాముడుగా కాంతారావు, సీతగా కృష్ణ కుమారి నటించారు.
5. వీరాంజనేయ:
ఈ చిత్రాన్ని కమలాకర కామేశ్వరరావు తెరకెక్కించారు. ఈ చిత్రంలో ముడుగా కాంతారావు, సీతగా అంజలీదేవి నటించారు. ఈ చిత్రం 1968లో విడుదలైంది.
6. సంపూర్ణ రామాయణం:
దర్శకుడు బాపు తెరకెక్కించిన తోలి పౌరాణిక చిత్రం ‘సంపూర్ణ రామాయణం’. ఈ చిత్రం 1972లో రిలీజ్ అయ్యి విజయం సాధించింది. ఈ సిచిత్రంలో రాముడుగా శోభన్ బాబు నటించగా, సీతగా చంద్రకళ నటించింది. ఈ చిత్రంలో రావణాసురుడి పాత్రలో ఎస్.వి. రంగారావు నటన అద్వితీయం.
7. శ్రీ రామాంజనేయ యుద్ధం:
బాపు దర్శకత్వంలో ఈ చిత్రం రాముడు హనుమంతుని మధ్య యుద్ధం నేపథ్యంలో తెరకెక్కింది. రాముడిగా ఎన్టీఆర్ నటించగా, సీత పాత్రలో బి. సరోజాదేవి నటించింది, ఈ చిత్రం 1975 లో విడుదల అయ్యింది.

8. సీతా కళ్యాణం:
బాపు గారు తెరకెక్కించిన మరో పౌరాణిక చిత్రం ‘సీతా కళ్యాణం’. ఈ చిత్రంలోని కథ సీతారాముల కళ్యాణం దాకా మాత్రమే ఉంటుంది. ఈ చిత్రంలో రాముడిగా రవికుమార్ అనే కొత్త నటుడు చేశారు. సీతగా జయప్రద నటించింది. ఈ సినిమా 1976లో రిలీజ్ అయింది.
9.సీతా రామ వనవాసం:
కమలాకర కామేశ్వర రావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీతా రామ వనవాసం’. ఈ చిత్రంలో రాముడిగా రవికుమార్, సీతగా జయప్రద నటించింది. ఈ చిత్రం 1977లో రిలీజ్ అయ్యింది.
10. శ్రీరామ పట్టాభిషేకం:
ఎన్టీఆర్ రామాయణం ఆధారంగా ‘శ్రీరామ పట్టాభిషేకం’ అని చిత్రాన్ని చేశారు. ఈ చిత్రానికి ఆయనే దర్శకత్వం, నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ రాముడిగా, రావణుడిగా నటించారు. సీత పాత్రలో సంగీత నటించారు. ఈ సినిమా 1978లో రిలీజ్ అయింది.
11. రామాయణం:
ఈ చిత్రాన్ని బాల రామాయణం అని కూడా పిలుస్తారు. ఈ చిత్రం పూర్తిగా బాల నటినటులతో తీశారు. 1997లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో రాముడిగా జూనియర్ ఎన్టీఆర్, సీతగా స్మితా మాధవ్ నటించారు.
12. శ్రీరామరాజ్యం:
బాపుగారు దర్శకత్వం వహించిన మరో పౌరాణికం సినిమా ‘శ్రీరామరాజ్యం’. ఈ చిత్రం ఎన్టీఆర్ నటించిన ‘లవకుశ’ చిత్రానికి రీమేక్ లాంటింది. ఈ చిత్రంలో రాముడిగా నందమూరి బాలకృష్ణ నటించారు. సీతగా నయనతార నటించింది.
13. ఆదిపురుష్:
ఈ చిత్రానికి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ నటించగా, సీతగా కృతి సనన్ నటిస్తున్నారు. ఈ మూవీ జూన్ 16 న రిలీజ్ కాబోతుంది.
Also Read: “ఆదిపురుష్” లో డిలీట్ చేసిన డైలాగ్ ఏదో తెలుసా..? ఎందుకు తీసేసారు అంటే..?

ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ ప్రపంచవ్యాప్తంగా నేడు విడుదలైంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ మరియు ఆయన ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆదిపురుష్ రిలీజ్ అయిన థియేటర్ల దగ్గర వాతావరణం జాతరను తలపిస్తోంది. ఫ్యాన్స్ బాణాసంచా కాాలుస్తూ హంగామా చేస్తున్నారు. ఈ మూవీకి మొదటి షోతోనే పాజిటివ్ టాక్ రావడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేవు. రాముడి క్యారెక్టర్ లో ప్రభాస్ అద్భుతంగా చేసారంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
ఆదిపురుష్ థియేటర్లలో రామ భక్తుడు హనుమంతుడి కోసం ఒక సీటును కేటాయించాలని డైరెక్టర్ ఓం రౌత్ కోరిన సంగతి తెలిసిందే. శ్రీ రాముడి కథ ఎక్కడ వినిపించినా అక్కడికి హనుమంతుడు వస్తాడని భక్తుల నమ్మకం. అనుకున్నట్టుగానే థియేటర్ లోకి హనుమంతుడు వచ్చాడు. ఆదిపురుష్ మూవీ ప్రదర్శిస్తున్న ఒక థియేటర్ లోకి కోతి వచ్చింది.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హనుమంతుడి కోసం రిజర్వ్ చేసిన సీటులో హనుమంతుడి ఫోటోను పెట్టి పూజ చేస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట్లో ఎక్కడ చూసినా ఆదిపురుష్ గురించిన వార్తలే. తాజాగా ఈ సినిమా రిలీజ్ పై రకరకాల మీమ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఆ మీమ్స్ ఏమిటో మీరు చూడండి..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
ప్రపంచవ్యాప్తంగా 7 వేల థియేటర్లలో ఈమూవీని రిలీజ్ చేస్తున్నారనే విషయం తెలిసిందే, అయితే నేపాల్ లో ఈ సినిమా రిలీజ్ ను అడ్డుకుంటామని ఖాట్మండు మెట్రోపాలిటన్ సిటీ మేయర్ బాలెన్ షా సోషల్ మీడియా ద్వారా చెప్పారు. దానికి కారణం ఈ సినిమా ట్రైలర్ లో “సీత భారతదేశపు కుమార్తె” అనే డైలాగ్ ఉంది.
ఈ డైలాగ్ పై ఖాట్మండు మేయర్ బాలెన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే సీత జన్మస్థలం గురించిన మిస్టేక్ ను సరిచేయాలని ఆదిపురుష్ మేకర్స్ ను కోరారు. ఇదే విషయం పై నేపాల్ సెన్సార్ ప్యానెల్ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. అందువల్ల ఆ డైలాగ్ ని సినిమా నుండి డిలీట్ చేశారని తెలుస్తోంది.
శివదుర్గ ప్రసాద్ డైరెక్టర్ తేజ దర్శకత్వం వహించిన ఫ్యామిలీసర్కస్ సినిమా ద్వారా గుర్తింపు పొందాడు. ఈ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్, రోజా ప్రధాన పాత్రలలో నటించారు. శివదుర్గ ప్రసాద్ రాజేంద్రప్రసాద్ కొడుకుగా నటించాడు. పక్కింట్లో ఉండే జగపతిబాబును బాగా విసిగించే పాత్రలో నటించి ఆడియెన్స్ ని అలరించాడు. ఈ మూవీ ద్వారా వచ్చిన గుర్తింపుతో అతనికి వరుసగా సినిమాలలో అవకాశాలు వచ్చాయి. అలా ఆ అబ్బాయి ఇంద్ర సినిమాలో నటించాడు.
మీది తెనాలి మాది తెనాలి సన్నివేశంలో ఏవీఎస్, బ్రహ్మనందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం వంటి హాస్యనటులతో కలిసి నటించాడు. ఈ డైలాగ్ ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శివ దుర్గ ప్రసాద్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను బాల నటుడిగా 1997 లో ఉషాకిరణ్ మూవీస్ సంస్థలో ఒక సినిమాలో నటించానని చెప్పారు.
ఇంద్ర, గంగోత్రి, ఔనన్నా కదన్నా లాంటి సినిమాలలో నటించానని, ఫ్యామిలీ సర్కస్ ఎక్కువ గుర్తింపును ఇచ్చిందని అన్నారు. దాదాపు 80 కి పైగా సినిమాలలో, 20 కి పైగా సీరియల్స్ లో చైల్డ్ ఆర్టిస్ట్ నటించినట్టు తెలిపాడు. రాజమౌళి దర్శకత్వం వహించిన శాంతినివాసం సీరియల్ లో చేశానని అన్నారు. పాపులర్ సీరియల్ అయిన అమృతంలో నరేష్ కొడుకుగా నటించానని తెలిపాడు.
ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతాదేవిగా నటిస్తున్న ఆదిపురుష్ చిత్రం కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాని విజువల్ వండర్ గా తెరక్కెకించారు. ప్రముఖ బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ ఈ చిత్రంలో రావణుడి పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
ప్రతి థియేటర్ లో హనుమంతుడి కోసం ఒక సీటు ను కేటాయించాలని మేకర్స్ ప్రకటించారు. తాజాగా దీనికి సంబంధించి అప్డేట్ లో మల్టీప్లెక్స్ లలో ఒక సీటును ఏర్పాటు చేస్తున్నట్టు, దాని పై ఆంజనేయస్వామి విగ్రహం లేదా ఫోటోను పెట్టి, ప్రతిరోజూ ఆంజనేయస్వామికి పూలను సమర్పించబోతున్నట్లుగా ఒక న్యూస్ పోర్టల్ తెలిపింది. ఇక ఆంజనేయస్వామి కోసం కేటాయించిన సీటు ముందువరుసలో కార్నర్ లో ఉంటుదని తెలిపింది.
ఇటీవల దర్శకుడు ఓంరౌత్ హనుమంతుడి కోసం ఒక సీటు కేటాయిస్తున్నట్లు ప్రకటించాడు. ఓంరౌత్ మాట్లాడుతూ మా అమ్మగారు రామాయణం పారాయణం చేసినపుడు కానీ, శ్రీరాముడి గాథను ప్రదర్శించిన, లేదా కథను చెప్పిన అక్కడికి హనుమంతుడు తప్పక వస్తాడని చెప్పేవారని అన్నారు. అందువల్ల హనుమనుతుడి కోసం ఆదిపురుష్ థియేటర్లలో ఒక సీటును కేటాయించాలని నిర్మాతల భూషణ్ కుమార్ ను, డిస్ట్రిబ్యూటర్లను కోరారు.
స్టోరీ:
మంచి భర్త కోసం ఎదురుచూసే ప్రీత్ (అన్యా సింగ్), ముంబైలో చిన్న ఇంట్లో ఉండలేక తన భర్తతో ఎలాగైనా వేరు కాపురం పెట్టించాలని ప్రయత్నించే షీతల్ (సంవేదన), వివాహితను ప్రేమించానని తెలుసుకున్న షాహిద్ (హుస్సేన్ దలాల్), తమ రిలేషన్ ను బయట పెట్టలేని పార్టనర్ తో మెల్రాయ్ (సయాన్ బెనర్జీ). వీరంతా లావణ్య స్కూల్ మేట్స్. ప్రతి ఒక్కరికి, ఒక్కో కథ ఉంటుంది. అందరు తాము అనుకున్నది చేశారా లేదా? చివరికి ఏమైంది అనేది తెలుసుకోవాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.
రివ్యూ:
సినిమాల్లో ఎక్కువగా గ్లామర్ పాత్రలు చేసిన తమన్నా ఈ వెబ్ సిరీస్ లో ఇప్పటివరకు చేయని రొమాంటిక్ సన్నివేశాలలో నటించారు. లావణ్య క్యారెక్టర్ లో నటనతో ఆకట్టుకున్నారు. నిను వీడని నీడను నేను అనే తెలుగు మూవీలో హీరోయిన్ గా నటించిన అన్యా సింగ్ ఈ సిరీస్ లో ప్రీత్ క్యారెక్టర్ లో డీసెంట్ నటనను కనపరిచింది. ఆషిమ్ గులాటీ, సుహైల్ నయ్యర్ మరియు ఇతర నటీనటుల తమ పాత్రల మేరకు నటించారు.
ప్లస్ పాయింట్స్:

రివ్యూ:
ఎరోటిక్ సన్నివేశాల విషయంలో మూవీ టెక్నిక్స్ అనుసరించకుండా దర్శకుడు బోల్డ్‌గా చూపించాడు. బాలి పగ తీర్చుకునే సీన్స్ లో హింస, రక్తపాతం ఎక్కువగా ఉంది. మొత్తం 9 ఎపిసోడ్ లతో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు.బాలి చిన్నతనం, రక్తం చూస్తే భయపడే బాలి నేరస్తుడిగా ఎలా మారాడు అనేది ఎమోషనల్‌గా చూపించారు. నగల షాప్ ఓనర్ మోసం చేయడంతో బాలి విప్లవ దారిలో వెళ్ళడం సిరీస్ లో కొత్త టర్న్.
బాలి కళావతి పై ఇష్టంతో దళంలో చేరి, గొప్ప లీడర్ గా ఎలా ఎదిగాడు అనేది యాక్షన్ సీన్స్,పగ వంటి వాటితో నడిపించారు. బాలి పాత్రకు రుషి పూర్తిగా న్యాయం చేశాడు. అమాయకంగా కనిపిస్తూనే క్రూయాలిటీని చూపించాడు. జయగా దేవయాని బోల్డ్ పాత్రలో నటనతో ఆకట్టుకుంది. రవికాలే, కామాక్షి భాస్కర్ల, జాఫర్ సాధిక్ వారి నటనతో మెప్పించారు.
ప్లస్ పాయింట్స్:
రీసెంట్ గా భారత మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, సునీల్ గావాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్ మరియు విండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ ఒక ‘పాన్ మసాలా’ ప్రకటనలో నటించారు. దాంతో గౌతమ్ గంభీర్ ఓ ఇంటర్వ్యూలో వారి పై ఘాటుగా స్పందించాడు. డబ్బు సంపాదించడం కోసం ఎన్నో మార్గాలు ఉన్నాయని, పాన్ మసాలా ప్రకటనలలో నటించడం వల్ల ఆ ప్రకటనలు చూసే కోట్లాది పిల్లలకు చెడు సందేశం వెళ్తుందని గంభీర్ అన్నారు.
గంభీర్ మాట్లాడుతూ ‘ఒక క్రికెటర్ పాన్ మసాలా ప్రకటనలో నటిస్తారని తన లైఫ్ లో అనుకోలేదని, ఈ పని అసహ్యంగా ఉందని అన్నారు. ఈ యాడ్ ద్వారా ఏం సందేశం ఇస్తున్నారని గంభీర్ అడిగాడు. అలాగే రోల్ మోడల్స్‌ను కొంచెం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలని ఫ్యాన్స్ కి సూచించాడు. ‘‘ఏ వ్యక్తి అయినా వారు చేసే పని ద్వారానే గుర్తింపును తెచ్చుకుంటాడు. కోట్లాది మంది మిమ్మల్ని చూసి, మీరు చేసేవాటిని అనుకరిస్తూ ఉంటారు. అందువల్ల పాన్ మసాలా ప్రకటన చేయడం కరెక్ట్ కాదని అన్నారు.
ఈ క్రమంలో గతంలో ఒక విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. గంభీర్ సచిన్ తెందూల్కర్ గురించి చెప్పారు. ‘సచిన్‌కు ఒక సమయంలో పాన్ మసాలా ప్రకటన కోసం రూ. 20-30 కోట్ల ఆఫర్ వచ్చింది. అయితే సచిన్ ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేశారు. ఆల్కహల్, పొగాకు ఉత్పత్తుల యాడ్స్ చేయనని తన తండ్రికి సచిన్ మాట ఇచ్చాడు. అందువల్లే సచిన్ ఒక రోల్ మోడల్’ అని గౌతమ్ గంభీర్ అన్నారు.
1. ఇంగ్లీష్ :
2. ఇండియన్ రైల్వే:
3. ఇండియన్ ఆర్మీ:
4. టీకాలు
5. జనాభా లెక్కలు
జనాభా యొక్క వయస్సు, లింగం, మతం, కులం, విద్య వంటి గణాంక సమాచారాన్ని సేకరించేవారు. 1871 – 2011 వరకు 15 సార్లు జనాభా గణన నిర్వహించబడింది.
తమిళనాడులో జన్మించిన స్వక్ష అయ్యర్ చిన్నప్పటి నుండే ప్రకటనలలో, సినిమాలలో ను బాలనటిగా రాణించింది. ఆమె ఇప్పటివరకు 130 కి పైగా ప్రకటనల్లో నటించింది. అంతేకాకుండా కోలీవుడ్ మరియు శాండల్‌వుడ్ లో పలు సినిమాలలో నటించింది. స్వక్ష మొదట టెలివిజన్ ప్రకటనలలో నటించడం ద్వారా తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. పలు వాణిజ్య ప్రకటనలలో నటించిన తర్వాత, ఆమె మొదటి సారిగా 2013లో కళ్యాణ సమయ సాధన అనే సినిమా ద్వారా కోలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.
స్వక్ష అయ్యర్ 2016 లో తమిళ హాస్యనటుడు సంతానం హీరోగా నటించిన దిల్లుకు దుద్దులో బాలనటిగా కీలక పాత్రను పోషించింది. ఇందులో స్వక్ష హీరోయిన్ చిన్నప్పటి పాత్రను పోషించింది. ఆ తరువాత 2017 లో విడుదలైన నిబునన్ అనే సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కూతురిగా నటించింది. ఈ సినిమాలో హీరో ప్రసన్న, వరలక్ష్మి శరత్‌కుమార్ మరియు సుహాసిని నటించారు. ఈ మూవీ తెలుగులో కురుక్షేత్రం పేరుతో రిలీజ్ అయ్యింది. అదే ఏడాది స్టంట్ కొరియోగ్రాఫర్ దిలీప్ సుబ్బరాయన్ నటించిన ‘సాంగు చక్రం’ అనే సినిమాలో స్వక్ష నటించింది.
స్వక్ష అనేక టీవీ కమర్షియల్ ప్రకటనలలో నటించింది. హై-ప్రొఫైల్ బ్రాండ్లను ఆమోదించింది. హాట్సన్ పెరుగు, కోల్గేట్ టూత్ పేస్ట్, లక్ష్మీ విలాస్ బ్యాంక్, ఉదయకృష్ణ నెయ్యి వంటి 130 యాడ్స్ పైగా నటించింది. ప్రస్తుతం మోడెల్, నటిగా కొనసాగుతుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే స్వక్ష అయ్యర్ కి ఇంస్టాగ్రామ్ లో 217 ఫాలోవర్స్ ఉన్నారు.