దర్శకుడు త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గుంటూరు కారం సినిమాను తెరకెక్కిస్తున్నారు. అనుకోని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మూవీని నుండి తప్పుకున్నాడని, ఆ తరువాత పూజ హెగ్డే తప్పుకుందని వార్తలు వినిపించాయి. గుంటూరు కారం దర్శకుడు త్రివిక్రమ్ హఠాత్తుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో మూవీని ప్రకటించాడు. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఫిలవుతున్నట్టుగా తెలుస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబోలో నాలుగవ సినిమాను ప్రకటిస్తూ మేకర్స్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వార్త వల్ల మహేష్ ఫ్యాన్స్ లో నిరసన కనిపిస్తోంది. గుంటూరు కారం మూవీ షూటింగ్ సగం కూడా చేయలేదు. ఇప్పటికే పలుమార్లు వాయిదాలు, స్క్రిప్ట్ లో మార్పులు, పూజా హెగ్డేని తప్పించడం, తమన్ గురించి ఇలా చాలా ఆటంకాలతో వాయిదా పడింది.
కొన్ని రోజుల నుండి ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతోంది. దాంతో ఫ్యాన్స్ సర్లే షూటింగ్ మొదలయ్యింది. కాబట్టి సంక్రాంతికి రిలీజ్ చేస్తే చాలని ఫ్యాన్స్ మూవీ అప్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. తీరా చూస్తే త్రివిక్రమ్ నుండి అల్లు అర్జున్ అనౌన్స్ మెంట్ వచ్చింది. సూపర్ స్టార్ అభిమానులు ఫీలవడానికి కారణం కొన్ని నెలలు ఆగి గుంటూరు కారం మూవీ చివరి స్టేజ్ లో ఉన్నప్పుడు అల్లు అర్జున్ తో మూవీ గురించి ప్రకటిస్తే బాగుండేది.
హఠాత్తుగా ఇప్పుడే ప్రకటించడం వల్ల మీడియా అటెన్షన్ మొత్తం ఆ ప్రాజెక్టు మీదనే ఉంటుందని అభిమానులు అనుకుంటున్నారట. ఆ మూవీ ఏ జానర్, సినిమాకి బడ్జెట్ ఎంత, కథ ఏంటి లాంటి ప్రశ్నలతో బన్నీ మూవీ గురించే చర్చలు జరుగుతాయని, అప్పుడు గుంటూరు కారం మూవీ పక్కకు వెళ్తుందని మహేష్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారట.
Also Read: “ప్రాజెక్ట్ K” లో ప్రభాస్ పాత్ర ఇదేనా..? అది ఏమిటంటే..?