“ఇదేం పని..?” అంటూ… తిడ్తున్న నెటిజన్లు..! ఏం జరిగిందంటే..?

“ఇదేం పని..?” అంటూ… తిడ్తున్న నెటిజన్లు..! ఏం జరిగిందంటే..?

by kavitha

Ads

ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మెన్ మార్నస్ లబుషేన్ రీసెంట్ గా టెస్టుల్లో టాప్ ప్లేస్ ను కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఆటగాడు ప్రస్తుతం యాషెస్ సిరీస్‌లో అడుతున్నాడు. అయితే మార్నస్ లబుషేన్ కు ఓ అలవాటు కలదు.

Video Advertisement

ఏ మ్యాచ్‌ కి అయినా చూయింగ్‌ గమ్‌ లేకుండా మార్నస్ మైదానంలో అడుగుపెట్టడు. మ్యాచ్ ప్రారంభం అయినప్పటి నుండి ముగిసేవరకు చూయింగ్‌ గమ్‌ నములుతూ ఉంటాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్‌ లో ఒక సంఘటన చోటు చేసుకుంది.

ఈ మ్యాచ్ లో మార్నస్‌ లబుషేన్‌ చేసినటువంటి ఒక పనికి సంబంధించిన వీడియో ఒకటి బయటికి వచ్చింది. ఆ వీడియో వైరల్ అవడంతో నెటిజెన్లు అతని పై కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.. యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్‌ వేదికగా ఇంగ్లండ్‌తో మొదలైన రెండో టెస్టులో మొదటి రోజు మార్నస్‌ లబుషేన్‌ బ్యాటింగ్‌కు దిగాడు. ఎప్పటిలానే లబుషేన్‌ నోట్లో చూయింగ్‌ గమ్‌ తో మైదానంలోకి వచ్చాడు. ఇక బ్రేక్‌ లో బ్యాటింగ్‌ రెడీ అవుతున్న సమయంలో అతని నోటిలో నుండి చూయింగ్‌ గమ్‌ మైదానంలో పడిపోయింది.

 

అయితే చూయింగ్‌ గమ్‌ మట్టిలో పడిన తరువాత కూడా దానిని అలాగే తీసి నోట్లో పెట్టుకున్నాడు. అంపైర్‌ పర్మిషన్ తీసుకొని మట్టిలో పడ్డ చూయింగ్‌ గమ్‌ను పడేయకుండా, అలాగే నోటిలో పెట్టుకోవడం,చూయింగ్‌ గమ్‌కు మట్టి అంటినప్పటికీ అది ఏమాత్రం పట్టించుకోకుండా నోట్లో వేసుకుని తన స్టైల్‌లో నమలడం మొదలు పెట్టాడు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజెన్లు తమదైన రీతిలో లబుషేన్‌ ను తిడుతున్నారు. ఇక ఈ మ్యాచ్‌ లో స్టీవ్‌ స్మిత్‌ సెంచరీ చేయడంతో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 416 రన్స్ కు ఆలౌట్‌ అయింది. ఆ తరువాత ఇంగ్లండ్‌ రెండవ రోజు మ్యాచ్ ముగిసేసరికి 4 వికెట్ల కోల్పోయి 278 పరుగులు చేసింది.

Also Read: “ఈ సారి వరల్డ్ కప్ గెలవడానికి యువరాజ్ సింగ్ లాంటి ప్లేయర్ ఇతనే.!” అంటూ… “శ్రీకాంత్” కామెంట్స్..! అతను ఎవరంటే..?


End of Article

You may also like