ఇప్పుడు స్టార్ హోదా అనుభవిస్తున్న చాలామంది సెలబ్రెటీలు ఒకప్పుడు ఇన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళే.. వాళ్ళాలో టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్, నటుడు సునీల్ కూడా ఉన్నారు.
త్రివిక్రమ్, సునీల్ వీళ్లద్దరూ ఫ్రెండ్స్ అని అందరికీ తెలిసిందే. సినిమా కెరీర్ ప్రారంభించిన మొదట్లో వీరు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లక్డీకపూల్ లో ఓ చిన్న అద్దె ఇంట్లో ఉంటూ సినిమా ప్రయత్నాలు ప్రారంభించారు.

ఐతే ఇక్కడే ఒక విచిత్ర సంఘటన జరిగింది. త్రివిక్రమ్ ఒక సందర్భంలో మనిషి జీవితంలో డబ్బు, భయం గురించి చెబుతూ.. తాను, సునీల్ లక్డీకపూల్ లోని అద్దె ఇంట్లో ఉండేవాళ్లమని , సరైన సమయానికి అద్దె చెల్లించకపోవడంతో రూమ్ ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని త్రివిక్రమ్ తెలిపారు. ఇంటి ఓనర్ అలా చెప్పినప్పుడు నా జేబులో 28 రూపాయలు మాత్రమే ఉన్నాయి, సునీల్ ఏమో తర్వాత రోజు ఆ 28 రూపాయలతో బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎలా చేయాలో ఆలోచిస్తుండగా తాను 28 రూపాయలు సునీల్ కి ఇచ్చి రోడ్ అవతలి వైపు ఉన్న షాప్ ని చూపిస్తూ కోక్ టిన్స్” కొని తెమ్మన్నానని, అలా ఆ డబ్బుని అప్పుడే ఖర్చు చేయడంతో సునీల్ షాకయ్యాడని త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు.

మొత్తం డబ్బులతో కూల్ డ్రింక్స్ కొంటే రేపు ఎలా తింటామని సునీల్ ప్రశ్నించాడని త్రివిక్రమ్ పేర్కొన్నారు. ఆ డబ్బు రేపు ఖర్చు పెడితే సంపాదన గురించి రేపట్నించి ఆలోచిస్తాం అవి ఇప్పుడే ఖర్చు చేస్తే చచ్చినట్టు ఇప్పటినుంచే ఆలోచిస్తామని చెప్పినట్టు త్రివిక్రమ్ పేర్కొన్నారు. మనం భయపడితే దారులు ఉన్నా కనిపించవని, విషమ పరిస్థితులు ఎదురైతే భయపడకూడదని త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు. భయాన్ని వదిలేసి ధైర్యంతో ముందడుగు వేస్తే అనుకున్నది సాధించడం సాధ్యమేనని త్రివిక్రమ్ వెల్లడించారు. త్రివిక్రమ్ చేసిన కామెంట్లు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.






పీహెచ్ స్కేలుపై 1 నుంచి 14 వరకు స్కోర్ ఉంటుంది. 7 కన్నా తక్కువ విలువ ఉంటే ఆ ద్రవాన్ని ఆమ్లమని, 7 కన్నా ఎక్కువ విలువ ఉంటే ఆ ద్రవాన్ని క్షారమని అంటారు. అయితే 7 విలువ ఉంటే ఆ ద్రవాన్ని తటస్థ ద్రవమని పిలుస్తారు.ఈ క్రమంలోనే నీటి పీహెచ్ విలువ చూస్తే అది 7 కన్నా ఎక్కువగా, కాఫీ, టీల పీహెచ్ విలువలు 5, 6లుగా ఉంటాయి. కాబట్టి కాఫీ, టీలు ఆమ్లత్వాన్ని (యాసిడిక్) కలిగి ఉంటాయి.





మరి వీరు ఎక్కువ పెట్టుబడులు ఎందులో పెట్టి ఎంత సంపాదించారో ఓ సారి చూద్దాం..? అనుష్క శర్మ సినిమా రంగంలో హీరోయిన్ గా చేస్తూ స్టార్ అయింది.విరాట్ కోహ్లీ విషయానికి వస్తే భారత్ క్రికెట్ ప్లేయర్ నుంచి కెప్టెన్ వరకు ఎదిగారు. ఈ క్రమంలోనే వీరిద్దరు ఒక యాడ్ లో నటించడంతో వారి మధ్య ప్రేమ చిగురించింది. దీంతో లవ్ బర్డ్స్ గా ఉన్న వీరు వివాహం చేసుకొని చాలా ఆనందమైన జీవితాన్ని గడుపుతున్నారని చెప్పవచ్చు.
వీరిద్దరూ సొంతంగా సంపాదించుకున్న సంపాదనతోనే ఇండియాలోనే రిచ్చెస్ట్ గా పేరును సంపాదించుకున్నారు. వీరి ఆస్తుల వివరాలు చూస్తే మనకు కళ్లు చెదిరిపోతాయి. వీరిద్దరి ఆస్తులు కలిపి కొన్ని వందల కోట్లు ఉన్నట్టు తెలుస్తోంది. విరాట్ కోహ్లీ భారత్ లో స్టార్ క్రికెటర్ కావడం వల్ల ఆయన ఆడే మ్యాచ్ ఫీజులు మరియు ఎండోమెంట్ వంటి ఒప్పందాలు, రాబడులు చూస్తుంటే ఒక సంవత్సరంలో వంద కోట్లకు పైగా సంపాదిస్తారు అని సమాచారం.
ఇక అనుష్క శర్మ విషయానికి వస్తే ఆమె హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ వస్తున్నారు. అలాగే అనుష్క శర్మ కొన్ని రకాల వస్త్రాల బిజినెస్ కూడా చేస్తోందని దీని విలువ దాదాపు 65 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. గురువారు గుళ్లోని విరాట్ సొంత బంగ్లా 80 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.
అలాగే వీరిద్దరి కార్ల విలువ 25 కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. ముంబై నగరంలో పది కోట్ల విలువ చేసే ఒక అపార్ట్మెంట్. అలాగే ఖరీదైన వస్తువులు బైకులు ఉన్నాయి. ఇదే కాకుండా వీరు పలు పరిశ్రమ రంగాల్లో కూడా పెట్టుబడులు పెట్టి రెండు చేతులా సంపాదిస్తున్నారు.
ఇక విరాట్ కోహ్లీ పూర్తి ఆస్తుల వివరాలు చూస్తే దాదాపుగా 950 కోట్ల పైగానే ఉంటుందని అంచనా. ఇక అనుష్క శర్మ ఆస్తుల విషయానికి వస్తే 450 కోట్ల పైగానే ఉంటుందని తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే వీరి ఆస్తుల విలువ దాదాపు 1400 కోట్ల పైగానే ఉంటుందని తెలుస్తోంది.





















