ఈ సంవత్సరం వకీల్ సాబ్ తో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వచ్చే సంవత్సరం వరుస సినిమాలతో మన ముందుకు రాబోతున్నారు. అందులో మొట్టమొదటిగా విడుదల అవుతోంది భీమ్లా నాయక్. ఈ సినిమా మలయాళం సినిమా అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ కి రీమేక్ గా రూపొందుతోంది. ఇందులో రానా దగ్గుబాటి కూడా మరొక హీరోగా నటిస్తున్నారు. నిత్యా మీనన్ పవన్ కళ్యాణ్ కి జోడిగా నటిస్తున్నారు. వీరిద్దరూ కలిసి నటించడం ఇదే మొదటిసారి. ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 2022లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇందులో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక పాట రాశారు. ఆ పాట ఇటీవల విడుదలయ్యి ట్రెండింగ్ లో ఉంది. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ పాట రాయడం ఇది మొదటిసారి అయితే కాదు. అంతకు ముందు కూడా ఒక సినిమా మొత్తం పాటలు త్రివిక్రమ్ శ్రీనివాస్ రాశారు. రవి తేజ హీరోగా నటించిన ఒక రాజు ఒక రాణి సినిమా పాటలు అన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్ రాశారు. ఈ విషయం చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు.
















#2
#3
#5
#6
#7
#8
#10
#11

#14
#16
#17

#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15






#2
#3
#4
#5
#6
#7
#9
#10



























































