ఈ “5 నాక్స్” చాలు.. కోహ్లీ ఎంత గొప్ప ఆటగాడో చెప్పడానికి..! లిస్ట్ ఓ లుక్ వేయండి..!

ఈ “5 నాక్స్” చాలు.. కోహ్లీ ఎంత గొప్ప ఆటగాడో చెప్పడానికి..! లిస్ట్ ఓ లుక్ వేయండి..!

by Mohana Priya

Ads

ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇవాళ తన 33వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. విరాట్ కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విరాట్ కోహ్లీ గత రెండు సంవత్సరాల నుండి ఒక్క సెంచరీ కూడా చేయకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పటికి కూడా ప్రపంచ క్రికెట్‌లోని అత్యుత్తమ బ్యాటర్‌లలో ఒకరిగా విరాట్ కోహ్లీ ఉన్నారు. 70 అంతర్జాతీయ సెంచరీలలో సచిన్ టెండూల్కర్ (100), రికీ పాంటింగ్ (71) తర్వాత మూడవ స్థానంలో కోహ్లీ ఉన్నారు. విరాట్ కోహ్లీని అత్యుత్తమ బ్యాటర్‌లలో ఒకరుగా నిలబెట్టిన 5 నాక్‌లు ఏవో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

#1 ఇండియా శ్రీలంక 2012 CB సిరీస్

ఇందులో కోహ్లీ 86 బంతుల్లోనే అజేయంగా 133 పరుగులు చేశారు.

famous knocks of virat kohli

#2 ఢాకాలో జరిగిన ఏషియా కప్

2012లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన ఏషియా కప్ మ్యాచ్ లో కోహ్లీ 22 ఫోర్లు మరియు ఒక సిక్సర్ కొట్టి కెరీర్-బెస్ట్ 183 పరుగులు సాధించారు.

famous knocks of virat kohli

#3 మొహాలీలో జరిగిన 2016 ప్రపంచ టీ 20

2016 అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీకి అత్యుత్తమ సంవత్సరాల్లో ఒకటిగా నిలిచింది. ఇందులో మొహాలీలో కోహ్లీ చేసిన నాక్, కోహ్లీని T20 గ్రేట్‌గా మార్చింది. 161 పరుగుల ఛేదనలో భారత్‌ జట్టు స్కోర్ 49/3 ఉన్నప్పుడు కోహ్లీ, యువరాజ్‌ సింగ్‌లు ఇన్నింగ్స్‌ను పునర్నిర్మించడం ప్రారంభించారు. 94/4 వద్ద యువరాజ్ నిష్క్రమించిన తర్వాత, ధోనితో కలిసి కోహ్లీ విరోచిత భాగస్వామ్యం నెలకొల్పారు.

famous knocks of virat kohli

#4 ఇంగ్లాండ్ తో బర్మింగ్‌హామ్ లో జరిగిన సిరీస్

2018లో ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్‌లోని మొదటి టెస్ట్‌లో విరాట్ కోహ్లీ 149 పరుగులు చేశారు. ఇతర ఏ భారతీయ బ్యాట్స్‌మెన్ కూడా 26 దాటలేకపోయారు.

famous knocks of virat kohli

#5 అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్

కెప్టెన్‌గా కోహ్లీకి అది మొదటి టెస్ట్‌. ఇందులో వేలికి గాయం కారణంగా ధోని ఆడలేకపోయారు. కోహ్లీ ఈ సిరీస్ లో 2 సెంచరీలు సాధించారు. మొదటి ఇన్నింగ్స్‌లో కోహ్లీ 115 పరుగులతో భారత జట్టు 444 పరుగులు అందుకోగలిగింది.  రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 290/5 వద్ద డిక్లేర్ చేయడంతో భారత్ 362 పరుగులకు ఆలౌటైంది.  కోహ్లీ 141 పరుగులతో మరొకసారి తన పోరాట పటిమను ప్రదర్శించారు. ఇందులో మురళీ విజయ్‌తో కలిసి భారత్‌ను 242/2కు తీసుకెళ్లారు.

famous knocks of virat kohli


End of Article

You may also like