ఈ టీవీలో వచ్చే జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా మనల్ని అలరిస్తూ ఉంటారు గెటప్ శ్రీను. గెటప్ శీను సోషల్ మీడియాలో ఇటీవల పోస్ట్ షేర్ చేశారు. అందులో “విశాఖ జిల్లాలోని నక్కపల్లి కి చెందిన ఖ్యాతి అనే ఒక ఆరు నెలల పాప కి స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ SMA టైప్ 1 సమస్య ఉన్నట్టు తెలిపారు. ఈ సమస్య వల్ల ఆ పాప నరాలు, కండరాలు డామేజ్ అయ్యాయి.

ఈ కారణంగా తనకు ఊపిరి తీసుకోవడానికి, మెడ ఎత్తడానికి, కూర్చోడానికి, పాలు తాగడానికి కష్టంగా ఉంది. ట్రీట్మెంట్ చెయ్యకపోతే ఆ పాప కి ప్రమాదం. ట్రీట్మెంట్ కోసం కేవలం ఒక్క ఇంజక్షన్ ఇవ్వాలి. ఆ ఇంజక్షన్ అమెరికా నుండి వస్తుంది. దాని ఖర్చు 16 కోట్ల రూపాయలు. ఈ కారణంగా ఆ పాప తల్లిదండ్రులు క్రౌడ్ ఫండింగ్ చేస్తున్నారు. డబ్బులు చాలా ఎక్కువగా ఖర్చు అవుతాయని ఆలోచించకండి.
ఒకవేళ ఎక్కువ మంది సహాయం చేస్తే డబ్బు సర్దుబాటు అయ్యే అవకాశం ఉంది. మీకు ఎంత వీలైతే అంత సహాయం చేయండి. మీకు ఎంత మందికి వీలైతే అంత మందికి ఈ పోస్ట్ ని షేర్ చేయండి. డిస్క్రిప్షన్ లో డొనేషన్ లింక్స్ ఉన్నాయి. మన చిట్టితల్లి ఖ్యాతి ని కాపాడుకుందాం.” అని పోస్ట్ లో షేర్ చేశారు శ్రీను.

అయితే ఈ పోస్ట్ కి ఒక నెటిజన్ “అరె బ్రో రుణం లేదు అనుకోని ఇంకో కాన్పు చూడండి అంతే కానీ కోట్ల రూపాయలు ఖర్చు ఎవరు భరిస్తారు” అని కామెంట్ చేశారు. ఇందుకు శ్రీను “అరె బ్రో మీ ఇంట్లో జరిగితే ఇలానే అనుకుంటారా..???” అని రిప్లై ఇచ్చారు.







#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
#19
#20
#21



#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13





























#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10





#2
#5
#6
#8
#9
#10
#11
#12
#13
#14
#15