10 ఏళ్ల కిందటి షార్ట్ ఫిలిం కి 3 లక్షల వ్యూస్ కూడా లేవు…అదే కామెడీ సినిమాలో పెడితే 30కోట్ల బాక్సాఫీస్ రికార్డు.!

10 ఏళ్ల కిందటి షార్ట్ ఫిలిం కి 3 లక్షల వ్యూస్ కూడా లేవు…అదే కామెడీ సినిమాలో పెడితే 30కోట్ల బాక్సాఫీస్ రికార్డు.!

by Mohana Priya

Ads

గత ఏడాది రావలసిన ఎన్నో సినిమాలు కరోనా కారణంగా ఆలస్యం అయ్యాయి. అలా రిలీజ్ పోస్ట్పోన్ అయ్యి ఈ ఏడాది మన ముందుకు వచ్చిన సినిమా జాతిరత్నాలు. సినిమాలో ఉన్న లీడ్ యాక్టర్స్, అలాగే సినిమా నిర్మించేది వైజయంతి మూవీస్ సంస్థ కావడంతో జాతిరత్నాలు విడుదల అయ్యే ముందు నుంచే ఈ సినిమాకు సంబంధించి ప్రేక్షకులలో ఆసక్తి మొదలైంది. ఇంక టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా మీద అంచనాలు ఇంకా పెరిగాయి.

Video Advertisement

jathi ratnalu director anudeep kv short film

మార్చి 11వ తేదీన విడుదలైన జాతిరత్నాలు సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుంది. ఈ సినిమాకి డైలాగ్స్ ఇంకా కామెడీ హైలెట్ గా నిలిచాయి. ఈ సినిమా ప్రమోషన్స్ ని కూడా కొత్త కొత్త ఐడియాస్ తో చాలా డిఫరెంట్ గా చేశారు. ప్రోగ్రామ్స్ కి అటెండ్ అవ్వడంతో పాటు యూట్యూబ్ లో అలాగే సోషల్ మీడియాలో కూడా కొత్త ప్రమోషన్ కాన్సెప్ట్స్ తో ఎంటర్టైన్ చేశారు జాతిరత్నాలు సినిమా టీం.

jathi ratnalu director anudeep kv short film

ఈ సినిమా డైరెక్టర్ అనుదీప్ తెర వెనుక మాత్రమే కాకుండా ప్రోగ్రామ్స్ లో కూడా తన పంచ్ డైలాగ్స్ తో అందరిని నవ్వించారు. అనుదీప్ అంతకుముందు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా డైరెక్ట్ చేశారు. దాదాపు ఒక పది సంవత్సరాల క్రితం మిస్డ్ కాల్ అనే ఒక షార్ట్ ఫిలిం డైరెక్ట్ చేశారు అనుదీప్. ఈ షార్ట్ ఫిలిం రెండు పార్ట్ లుగా ఉంది. ఈ షార్ట్ ఫిలిం స్టోరీ నలుగురు ఫ్రెండ్స్ కి మధ్య నడుస్తుంది. ఈ షార్ట్ ఫిలిం లో ఉన్న చాలా డైలాగ్స్ మనం జాతిరత్నాలు సినిమాలో చూశాం. jathi ratnalu director anudeep kv short film

కానీ షార్ట్ ఫిలిం విడుదల అయ్యి చాలా సంవత్సరాలు అయింది కాబట్టి ఎక్కువ మందికి ఈ డైలాగ్స్ జాతిరత్నాలు సినిమా ద్వారానే తెలిసాయి. అంతే కాకుండా ఇప్పుడు యూట్యూబ్ లో కూడా ఈ షార్ట్ ఫిలిం కి మెల్ల మెల్లగా వ్యూస్ పెరుగుతున్నాయి. అనుదీప్ మిస్డ్ కాల్ షార్ట్ ఫిలిం మాత్రమే కాకుండా ఇంకొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా డైరెక్ట్ చేశారు. అంతే కాకుండా పిట్టగోడ సినిమాకి కూడా దర్శకత్వం వహించారు.

watch video :


End of Article

You may also like