కోహ్లీ 50 డెవెలెర్స్ పై ట్రోల్ల్స్ కి వచ్చింది అంటే ఇదే…ట్రెండ్ అవుతున్న 10 ట్రోల్ల్స్.!

కోహ్లీ 50 డెవెలెర్స్ పై ట్రోల్ల్స్ కి వచ్చింది అంటే ఇదే…ట్రెండ్ అవుతున్న 10 ట్రోల్ల్స్.!

by Mohana Priya

Ads

అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా మంగళవారం ఇంగ్లాండ్ కి టీం ఇండియా కి మధ్య జరిగిన మూడో టి20 మ్యాచ్ లో ఎనిమిది వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (77 నాటౌట్: 46 బంతుల్లో 8×4, 4×6) తో హాఫ్ సెంచరీతో టీమిండియా పరువు నిలబెట్టారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 6 వికెట్ల నష్టానికి 156 పరుగుల స్కోర్ చేసింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఫీల్డింగ్ ఎంచుకున్నారు.

Video Advertisement

trolls on ind vs eng 3rd t20

దాంతో రోహిత్ శర్మ (15: 17 బంతుల్లో 2×4)తో కలిసి భారత్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన ఓపెనర్ కేఎల్ రాహుల్ (0: 4 బంతుల్లో) మరోసారి డకౌట్ గా వెనుదిరిగారు. తరువాత మూడవ స్థానంలో వచ్చిన ఇషాన్ కిషన్ (4: 9 బంతుల్లో) స్కోర్ చేయగా, రిషబ్ పంత్ (25: 20 బంతుల్లో 3×4) లేని పరుగు కోసం ప్రయత్నిస్తూ రనౌట్ అయ్యారు.

తర్వాత శ్రేయాస్ అయ్యర్ (9: 9 బంతుల్లో)తో కలిసి భారత్ ఇన్నింగ్స్ ముందుకు నడిపించే బాధ్యత తీసుకున్న విరాట్ కోహ్లీ స్లాగ్ ఓవర్లలో టాప్ గేర్ ‌లోకి వెళ్లిపోయారు. ఇన్నింగ్స్ 16వ ఓవర్ వేసిన జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో ఒక ఫోర్, సిక్స్ చేసిన విరాట్ కోహ్లీ, తర్వాత క్రిస్ జోర్దాన్ ఓవర్ ‌లో కూడా ఒక సిక్స్, ఫోర్ కొట్టారు.

తర్వాత ఇన్నింగ్స్ 18వ ఓవర్ ‌ని వేసేందుకు మార్క్ ‌వుడ్ ‌రాగా, కోహ్లీ వరుసగా 6, 6, 4 లతో దూసుకెళ్లారు. చివరిలో కోహ్లీకి జోడీగా వచ్చిన హార్దిక్ పాండ్యా (17: 15 బంతుల్లో 2×6) కూడా రెండు సిక్సర్లు కొట్టడంతో టీమిండియా 156 పరుగుల స్కోర్ చేయగలిగింది. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్‌ వుడ్ మూడు వికెట్లు, క్రిస్ జోర్దాన్ రెండు వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10

#11


End of Article

You may also like