స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన రెండవ సినిమా సన్నాఫ్ సత్యమూర్తి. ఒక మనిషికి విలువలు అనేవి ఎంత ముఖ్యమో చెప్పే ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. సమంత, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటించగా, అదా శర్మ ఒక ఇంపార్టెంట్ రోల్ లో కనిపించారు. రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, పవిత్ర లోకేష్, సింధు తులానీ, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో నటించారు.
ఇంకా మరొక ఇంపార్టెంట్ క్యారెక్టర్, అలాగే టు వేరియేషన్స్ ఉన్న దేవరాజు పాత్రలో ఉపేంద్ర నటించారు. ప్రకాష్ రాజ్ కనిపించేది కొద్ది సేపే అయినా కూడా, ఆయన పాత్ర సినిమా మొత్తం ట్రావెల్ అవుతుంది. ఈ సినిమాలో ఒక సీన్ ఉంది. దానిని కొంత మంది పొరపాటు అంటే, కొంత మంది పొరపాటు కాదు అని, అలా అవ్వడానికి గల కారణం చెప్తున్నారు. అది ఏంటంటే.
ప్రకాష్ రాజ్ పాత్ర చనిపోయిన తర్వాత ఆస్తులు కోల్పోవడంతో హీరో కుటుంబం మొత్తం ఒక మామూలు ఇంటికి షిఫ్ట్ అవుతారు. ఒక సందర్భంలో వెన్నెల కిషోర్, సింధు తులాని కూతురుగా నటించిన బేబీ వెర్నికా, హోం వర్క్ చేస్తూ ఉంటుంది. పక్కనే తిరుగుతున్న ఫ్యాన్ సడన్ గా ఆగిపోతుంది. అప్పుడు హీరో ఫ్రిడ్జ్ డోర్ తెరిస్తే అందులో నుంచి గాలి వస్తుంది.
Also Read: S/O. సత్యమూర్తి చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?
అయితే ఈ సీన్ పై సోషల్ మీడియాలో రెండు రకాల అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. కొందరు “కరెంటు పోతే, ఫ్రిడ్జ్ ఎలా పనిచేస్తుంది?” అని అంటుంటే, ఇంకొంతమంది “కరెంటు పోలేదు. ఫ్యాన్ ఆగిపోయింది” అని అంటున్నారు. ఈ రెండిట్లో ఏది కరెక్టో డిసైడ్ చేసుకోవడం మన ఇమాజినేషన్ కే వదిలేశారు.